ఆ రోజు నాకు బట్టలు కూడా ఇవ్వలేదు.. దారుణంగా అవమానించారు

by Prasanna |   ( Updated:2023-05-19 07:21:53.0  )
ఆ రోజు నాకు బట్టలు కూడా ఇవ్వలేదు.. దారుణంగా అవమానించారు
X

దిశ, సినిమా: సినీ కెరీర్‌లో ఎదురైన చేదు జ్ఞాపకాలను ఎప్పటికీ మరిచిపోలేనంటోంది హన్సిక. ఇటీవల ఆమె నటించిన చిత్రాలు, సిరీస్‌లు అన్నీ కలిపి ఏడు. ఇవన్నీ త్వరలోనే ఒక్కొక్కటిగా ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఈ సందర్భంగా ప్రమోషన్స్ మొదలుపెట్టిన నటి రీసెంట్ ఇంటర్వ్యూలో పలు సందర్భాలను గుర్తుచేసుకుంది. ‘సౌత్‌లో స్టార్ హీరోయిన్‌గా ఎదిగినప్పటికీ కొంతమంది తక్కువ భావనతోనే చూశారు. ముఖ్యంగా ఫ్యాషన్ డిజైనర్స్. పలు ఈవెంట్స్ కోసం నాకు నచ్చిన డిజైన్ కావాలని అడిగితే ఎవరూ సహకరించలేదు. సౌత్ నటిననే కారణంగా నార్త్ వ్యాపారస్తులు నాకు దుస్తులు ఇవ్వడానికి కూడా ఇష్టపడలేదు. ఓ సినిమా రిలీజ్ ఈవెంట్స్ కోసం బట్టలు కావాలని అడిగితే ముఖంపైనే లేవని చెప్పేశారు’ అంటూ ఎమోషనల్ అయింది. అయితే ప్రస్తుతం అలాంటి పరిస్థితి ఇప్పుడు లేదన్న నటి.. ప్రముఖ స్టార్ డిజైనర్స్ కూడా తన ఆర్డర్ కోసం వస్తున్నారని చెప్పుకొచ్చింది.

Read more:

తన సక్సెస్ సీక్రెట్‌ బయటపెట్టిన స్టార్ హీరోయిన్

Advertisement

Next Story