Guppedantha Manasu: మహేంద్రని తండ్రి స్థానంలోకి రావొద్దని సీరియస్ గా చెప్పిన మను

by Prasanna |
Guppedantha Manasu: మహేంద్రని తండ్రి స్థానంలోకి రావొద్దని సీరియస్ గా చెప్పిన మను
X

దిశ, సినిమా: గుప్పెడంత మనసు ఎపిసోడ్ లో ఈ సీను హైలెట్

మా నాన్న గారు ఎవరో తను అసలు చెప్పలేదు. మేడమ్ మీరు నా గురించి బాధ పడకండి. నేను మంచిగానే ఉన్నాను. నాకు మీరు ఉన్నంతవరకు ఏమి కాదు.. నాకేం జరుగుతుందో అని మీరు భయపడాల్సిన అవసరం లేదని మను చెబుతాడు.ఆ తర్వాత వసుధారతో ఇలా ఎమోషనల్ గా మాట్లాడతాడు. మేడమ్ నేను మీలాంటి వాళ్లని ఇంతవరకు చూడలేదు. నా జీవితంలో నాకు ఇంత బాగా సపోర్ట్‌గా నిలిచిన వాళ్లు లేరు. ఇన్ని రోజులు కూడా ఒంటరిగానే ఉన్నట్టు.. అనిపించిందని అంటాడు.

మీకు, నాకు ఎలాంటి సంబంధం లేదు. అలాంటి నాకోసం చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ జన్మలో మీరు చేసిన మంచిని మర్చిపోలేను అని అంటాడు. అప్పుడు అదేం లేదు మను .. నేను మీకు ఒక ఫ్రెండ్ లాగా సపోర్ట్‌గా ఉన్నాను. ఈ విషయంలో నన్ను నడిపించింది మీ నాన్నగారే అని వసుధార అంటే.. ఇద్దరు కూడా షాక్ అవుతారు. అదేనండి.. మిమ్మల్ని దత్తత తీసుకుని మావయ్య గారు తండ్రి స్థానంలోకి రావాలనుకున్నారు కదా. అందుకే నాన్న గారు అని చెప్పాను అని వసుధార అంటుంది.

వసుధార ఇప్పుడు నువ్వు మాట్లాడిన మాటల్లో తప్పు ఏమి లేదమ్మా. ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావ్.. మనును నా కొడుకులాగే చూస్తున్నాను కదా. ఇంకా దత్తత కార్యక్రమం చేస్తాం కదా అని మహేంద్ర అంటాడు. సార్ మీరు అలా అనకండి .. నన్ను మీ కొడుకు లాగే చూస్తున్నారు. నేను కాదనడం లేదు.. కానీ, మీరు ఇలా నా తండ్రి స్థానంలోకి రాకండి అని మను అంటాడు. ఈ మాటకి మహేంద్ర, వసుధార షాక్ అవుతారు. ఇక్కడితో ఈ సీన్ ముగుస్తుంది.

Advertisement

Next Story

Most Viewed