- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Guppedantha Manasu: రిషి చనిపోయాడు.. ఇదిగో ఆధారం అంటూ.. టీషర్ట్ ఇచ్చిన ముకుల్
దిశ, సినిమా: గుప్పెడంత మనసు ఎపిసోడ్ లో ఈ సీను హైలెట్
‘మీ నమ్మకాలు మీకు ఉండొచ్చు.. కానీ మా డ్యూటీ మేము చేయాలి.. దయచేసి అర్ధం చేసుకోండి’ అని ముకుల్ అంటాడు. మా అల్లుడు గారు బంగారు.. మీరు ఇలా మాట్లాడి మమ్మల్ని బాధ పెట్టకండి అని చక్రపాణి అంటాడు. ‘‘అవును సార్.. దయచేసి ఈ టాపిక్ ఇంతటితో వదిలేసి.. రిషి సార్ ఎక్కడున్నారో తెలుసుకోండి’ అని వసుధార అంటుంది. ‘చూడండి మేడమ్.. అది రిషి సార్ డెడ్ బాడీ కాకూడదనే నేనూ కూడా అనుకుంటున్నాను..కానీ ఒకసారి హాస్పిటల్‌కి వెళ్లి చూసి చెప్పండి' అని ముకుల్ అంటాడు. ‘లేదు ముకుల్.. మేం అక్కడికి రాలేం.. ఇది ఇక్కడే వదిలేయండి’ అని మహేంద్ర అరుస్తాడు.
సార్, నేను చెప్పేది మీకు అర్ధం కావడం లేదు. కేసు ముందుకు వెళ్లాలంటే.. ముకుల్ చెప్పింది చేయాలి మహేంద్రా.. అని అనుపమ అంటుంది. ‘నీకేం తెలియదు అనుపమా? నువ్వు మాట్లాడకు.. ముకుల్ ఏమి చెబుతున్నాడో నీకు అర్ధం అవుతుందా? ఆ మాట వినడానికే చాలా కష్టంగా ఉంది.. నేను వెళ్లను.. నా రిషికి ఏం కాదు’ అంటూ అనుపమపై సీరియస్ అవుతాడు మహేంద్ర. ఓసారి వెళ్లి మనం చూస్తే అయిపోతుంది కదా.. దీనికి ఎందుకు నాపైన అరుస్తావ్ అని అనుపమ అంటుంది. ‘నీకు ఒకసారి చెప్తే అర్ధం కావడం లేదా?? లేక మళ్లీ మళ్లీ చెప్పాలా.. అది నా కొడుకు రిషి డెడ్ బాడీ కాదు.. అంటూ’ చాలా ఎమోషనల్ అవుతాడు మహేంద్ర.
వాళ్లు నమ్మడం లేదని ముకుల్.. తన దగ్గర ఉన్న ఆధారాలను వాళ్లకి చూపిస్తాడు. సరే ఇప్పుడు నేను ఒకటి చూపిస్తాను. అది మీ కొడుకుదా .. కాదనేది చెప్పండి చాలు అంటూ ‘ఈ టీ షర్ట్ రిషిదేనా? అని అడుగుతాడు. అక్కడే ఉన్న చక్రపాణి.. ఆ టీషర్ట్ రిషిదే అని గుర్తుపడతాడు. ‘అమ్మా వసూ.. అల్లుడు ఇంటికి వచ్చేటప్పుడు ఇదే టీషర్టే వేసుకున్నారమ్మా’ అని అంటాడు. ఆ మాటతో ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది వసుధార. ఇక్కడితో ఈ సీను ముగుస్తుంది.