- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. భారీగా పెరిగిన ‘గుంటూరు కారం’ టికెట్ ధరలు?
దిశ, సినిమా: భారీ అంచనాలతో తెరకెక్కిన సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం చిత్రం జనవరి 12 న విడుదలకు సిద్ధంగా ఉంది. నిన్న (జనవరి 9) ఈ చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్ గుంటూరులో గ్రాండ్‌గా నిర్వహించారు. కానీ ఫ్యాన్స్ రచ్చ కారణంగా తోపులాటలో పలువురికి గాయాలయ్యాయి. అయితే ప్రీమియర్ షోలు, మిడ్ నైట్ షోల అనుమతులు కోసం ఈ మూవీ బృందం ప్రయత్నించినట్లు వార్తలు వచ్చాయి. ఇప్పటికే కొన్ని చోట్ల అనుమతి కూడా లభించిందని టాక్.
తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సినిమా టికెట్ ధరను రూ. 50 వరకు పెంచుకునేందుకు చాన్స్ ఇచ్చినట్లు తెలుస్తుంది. త్వరలోనే అఫీషియల్‌గా జీవో కూడా విడుదల చేయనున్నారని సమాచారం. ఇక తెలంగాణాలో హైదరాబాద్ లాంటి మల్టీ ఫ్లెక్స్‌లలో రూ. 100 వరకు టికెట్ ధర పెరగనున్నట్లు నెట్టింట టాక్ నడుస్తోంది. రీసెంట్‌గా విడుదలైన ప్రభాస్ ‘సలార్’ చిత్రానికి ఏపీ ప్రభుత్వం 40 రూపాయల పెంపుకు అనుమతి ఇచ్చింది. సలార్ కంటే గుంటూరు కారం టికెట్ ధర ఎక్కువే అని చెప్పుకోవచ్చు.