గుంటూరు కారం‌ ఎఫెక్ట్.. ఇండస్ట్రీకి శ్రీలీలనే దరిద్రం.. ఫిల్మ్ నగర్‌లో ఘోరంగా ట్రోల్స్!

by Hamsa |   ( Updated:2024-01-27 07:11:29.0  )
గుంటూరు కారం‌ ఎఫెక్ట్.. ఇండస్ట్రీకి శ్రీలీలనే దరిద్రం.. ఫిల్మ్ నగర్‌లో ఘోరంగా ట్రోల్స్!
X

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ బ్యూటీ శ్రీలీల ‘పెళ్లి సందడి’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత రవితేజ ధమాకా మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని స్టార్ డమ్ సంపాదించుకుంది. ఇక అప్పటి నుంచి శ్రీలీల స్టార్ హీరోల సినిమాల్లో ఆఫర్లు అందుకుంటూ స్టార్ హీరోయిన్‌గా దూసుకుపోతుంది. ఈ అమ్మడు ఇటీవల నటించిన మూడు చిత్రాలు అంతంత మాత్రం అనిపించాయి.

రామ్ పోతినేని-స్కంధ, వైష్ణవ్ తేజ్ ఆదికేశవ, నితిన్- ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ ఈ మూడు సినిమాలు థియేటర్స్‌లో విడుదలై యావరేజ్ టాక్‌ను సొంతం చేసుకున్నాయి. వీటిలో హీరోయిన్ శ్రీలీలనే నటించింది. ఇక ఇప్పుడు మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన మూవీ గుంటూరు కారం. ఈ సినిమా నేడు థియేటర్స్‌లో గ్రాండ్‌గా రిలీజ్ అయింది. దీంతో అది చూసిన ఫ్యాన్స్ గుంటూరు కారం సినిమాకు, తెలుగు ఇండస్ట్రీకి శ్రీలీలనే దరిద్రం అని కామెంట్లు చేస్తున్నారు. అంతేకాకుండా ఆమెను కాకుండా వేరే హీరోయిన్‌గా తీసుకుంటే గుంటూరు కారం ఇంకా హైప్ వచ్చేదని అభిప్రాయపడుతున్నారు. ఇక దెబ్బతో అమ్మడుకి ఆఫర్లు తగ్గేటట్టుగా కనిపిస్తోంది.

Advertisement

Next Story