- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Devara Movie: దేవర టికెట్ల రేట్ల పెంపునకు గ్రీన్ సిగ్నల్.. ఎంత పెరిగాయంటే?
దిశ, వెబ్ డెస్క్: కొరటాల శివ డైరెక్షన్లో హీరోగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న మూవీ దేవర. ఈ సినిమా కోసం కేవలం అభిమానులు కాకూండా సినీ ఇండస్ట్రీ మొత్తం వేచి చూస్తున్నారు. నాలుగు రోజుల క్రితం విడుదలైన ట్రైలర్ కు భారీ రెస్పాన్స్ రావడంతో అప్పటి వరకు ఉన్న అంచనాలు కాస్తా అమాంతం పెరిగిపోయాయి. ఆచార్యతో ఫ్లాప్ అందుకున్న డైరెక్టర్ ఈ సారి పెద్ద హిట్ కొట్టి మళ్లీ తన సక్సెస్ ట్రాక్ లోకి వెళ్ళాలని చాలా కష్టపడి తెరకెక్కించాడు. దేవర మూవీ వరల్డ్ వైడ్ గా ఈ నెల 27 న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ప్రస్తుతం ఈ సినిమాలో నటించిన వారందరూ ప్రమోషన్లలో ఫుల్ బిజీ అయ్యారు. ఇక సినిమాలో నటించిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ అయితే గ్యాప్ లేకుండా మూవీ ప్రమోషన్స్ లో పాల్గొంటున్నాడు. ఆర్ఆర్ఆర్ తర్వాత తారక్ నుంచి సోలోగా వస్తున్న మూవీ అవ్వడంతో దేవర కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. మాస్ యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. తాజాగా, ఈ మూవీకి సంబంధించి న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అదేంటో ఇక్కడ చూద్దాం..
దేవర మూవీ భారీ బడ్జెట్ తో తెరకెక్కిన విషయం మనకి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే టికెట్ల రేట్లు పెంచమని ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలను చిత్ర బృందం కోరింది. ఈ విషయం రెండు ప్రభుత్వాల దృష్టికి వెళ్ళడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. దాంతో మేకర్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పెరిగిన టికెట్ల రేట్లు ఈ విధంగా ఉన్నాయి.నైజాంలో ఉన్న మల్టీప్లెక్స్ ల్లో రూ. 413, అలాగే సింగిల్ స్క్రీన్లలో రూ. 250 పెరిగాయి. ఇక ఏపీ లోని మల్టీప్లెక్స్ థియేటర్లలో రూ. 325, సింగిల్ స్క్రీన్లలో రూ. 200 పెరిగాయి. మెుదటి వారం ఈ ధరలు ఇలాగే ఉంటే భారీగా కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. ఈ సినిమాకే కాకుండా ఇంతక ముందు ఎన్నో సినిమాలకు టికెట్ల రేట్ల పెంపునకు ప్రభుత్వాలు అనుమతులు ఇచ్చాయి.