పరీక్షల సమయంలో ఒత్తిడికి గురికావద్దు : అడవి శేషు

by sudharani |   ( Updated:2023-03-24 14:06:59.0  )
పరీక్షల సమయంలో ఒత్తిడికి గురికావద్దు : అడవి శేషు
X

దిశ, సినిమా: పరీక్షల సమయంలో ఒత్తిడికి గురికాకుండా సులభమైన పద్ధతిలో నేర్చుకోవాలని విద్యార్థులకు సూచించాడు హీరో అడవి శేషు. హైదరాబాద్ మాదాపూర్‌లోని ఓ హోటల్‌లో గుడ్ స్కూల్ యాప్ ప్రారంభించిన ఆయన.. తెలుగు, ఇంగ్లీష్‌లో రూపొందించిన యాప్ గ్రామీణ ప్రాంత పిల్లలకు సైతం ఉపయోగకరంగా ఉంటుందన్నారు.

తెలుగు భాషలో చదివే పిల్లలకు కావాల్సిన విధంగా విద్యను అందించేందుకు యాప్‌ను అందుబాటులోకి తీసుకురావడం ఆనందంగా ఉందన్నారు. సహకారం, సృజనాత్మకత, ఆటతో నేర్చుకునే విధంగా రూపొందించినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమానికి గుడ్‌ స్కూల్‌ యాప్‌ ఛైర్మన్‌ వెంకట్‌రెడ్డి, ఎండీ శ్రీనివాసరావు, సీఈవో విజయ్‌ భాస్కర్‌, విద్యారంగ ప్రముఖులు హాజరయ్యారు.

Also Read..

రేవ్ పార్టీ.. పొలిటీషియన్స్ ఎందుకు ప్రోత్సహిస్తున్నారు?

Advertisement

Next Story