Devara: తారక్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ‘దేవర’ నుంచి మరో బిగ్ అప్డేట్

by Anjali |
Devara: తారక్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ‘దేవర’ నుంచి మరో బిగ్ అప్డేట్
X

దిశ, వెబ్‌డెస్క్: జూనియర్ ఎన్టీఆర్ హీరోగా వస్తోన్న దేవర చిత్రం కోసం ప్రేక్షకులంతా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తోన్న ఈ చిత్రానికి శివ కొరటాల దర్శకత్వం వహించారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ కంప్లీట్ చేసుకుని.. బాక్సాఫీసును షేక్ చేయడానికి రెడీగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఈ నెల (సెప్టెంబరు)27 వ తేదీన దేవర థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ కానుంది. దర్శకుడు ఈ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నాడు. మరీ పార్ట్-1 ప్రేక్షకుల అంచనాలకు చేరుకోనుందా? లేదా? అనేది తెలియాలంటే సెప్టెంబరు 27 వరకు వెయిట్ చేయాల్సిందే.

ప్రస్తుతం ఈ చిత్ర ప్రమోషన్స్ జోరుగా నడుస్తున్నాయి. ఇకపోతే దేవరపై హైప్ పెంచేందుకు ఇటీవలే మేకర్స్ ట్రైలర్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. విడుదలైన కొన్ని నిమిషాల్లోనే భారీ వ్యూస్ సొంతం చేసుకుంది. ఈ క్రమంలో తాజాగా దేవరపై మరో అప్డేట్ వచ్చింది. లిరిసిస్ట్ రామజోగయ్య శాస్త్రి ట్విట్టర్ వేదికన ఓ పోస్ట్ పెట్టి.. ఈ చిత్రంపై అభిమానుల్లో మరింత జోష్ నింపుతున్నారు. దేవర నాలుగో సాంగ్ పై అప్డేట్ ఇచ్చారు. ‘వచ్చే వీక్ పాన్ ఇండియా లెవల్‌లో పెద్ద బాంబ్ బ్లాస్ట్ కానుంది. ఆయుధ పూజ ట్రాక్ రాబోతుంది’ అని రాసుకొచ్చారు. గతంలో కూడా ఆయుధ పూజ అనంతరమే సాంగ్ రిలీజ్ అవ్వనుందని ప్రకటించారు. తాజాగా ఈ అప్డేట్ రావడంతో కచ్చితంగా నాలుగో పాటనే విడుదలవ్వబోతుందని ఫ్యాన్స్ అంచనా వేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed