సమంత ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘ఖుషీ’ సినిమా నుండి అదిరిపోయే అప్డేట్

by Hamsa |   ( Updated:2023-03-06 08:02:52.0  )
సమంత ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘ఖుషీ’ సినిమా నుండి అదిరిపోయే అప్డేట్
X

దిశ, వెబ్ డెస్క్: స్టార్ హీరోయిన్ సమంత, రౌడీ హీరో విజయ్ దేవరకొండ జంటగా నటిస్తున్న చిత్రం ‘ఖుషీ’. దీనికి డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా 2022 ఏప్రిల్‌లో విడుదల కావాల్సిన సినిమా సమంతకు మయోసైటీస్ వ్యాధి రావడంతో వాయిదా పడిన విషయం అందరికీ తెలిసిందే. సమంత అప్పటి నుండి షూటింగ్స్‌కు దూరంగా ఉండి రెస్ట్ తీసుకుంటుంది. దీంతో సామ్ అభిమానులు ఖుషీ చిత్రం ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. తాజాగా, ఖుషీ సినిమా నుండి డైరెక్టర్ శివ నిర్వాణ ట్విట్టర్ వేదికగా ఫ్యాన్స్‌కు అదిరిపోయే అప్డేట్ ఇచ్చాడు. ‘‘ త్వరలో ఖుషీ షెడ్యూల్ మొదలు కానుంది. పీటర్ హెన్స్ ఈ యాక్షన్ సీక్వెన్స్‌ని తెరకెక్కించబోతున్నాడు’’ అంటూ రాసుకొచ్చాడు. దీంతో అది చూసిన సామ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ప్రస్తుతం సమంత సిటాడెల్ వెబ్ సిరీస్ చేస్తుంది. త్వరలో ఖుషీ షూటింగ్‌లో జాయిన్ అవ్వడానికి సిద్ధమవుతుంది. కాగా, ఈ సినిమాకు మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు.

ఇవి కూడా చదవండి : మహేష్ బాబు సపోర్ట్ వల్లే శ్రీలీలకు అన్ని సినిమా ఆఫర్లు వచ్చాయా..?

Advertisement

Next Story

Most Viewed