ప్రభాస్ project-k సినిమా నుండి స్పెషల్ వీడియోను షేర్ చేసిన మేకర్స్

by Hamsa |   ( Updated:2023-04-10 13:44:25.0  )
ప్రభాస్ project-k సినిమా నుండి స్పెషల్ వీడియోను షేర్ చేసిన మేకర్స్
X

దిశ, వెబ్ డెస్క్: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, దీపికా పదుకొనే జంటగా నటిస్తున్న చిత్రం ప్రాజెక్ట్-కె. ఈ సినిమాకు నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించగా.. అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. దీనికి వైజయంతి నిర్మాణ సంస్థ బ్యానర్‌పై తెరకెక్కనుంది. శరవేగంగా షూటింగ్ జరుగుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది 2024 జనవరి 12న విడుదల కానుంది. ఈ మూవీ నుంచి ఎప్పుడెప్పుడు అప్డేట్ వస్తుందా అని ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా, చిత్రయూనిట్ అభిమానుల కోసం షూటింగ్ వీడియోను షేర్ చేశారు. అందులో మూవీ టీమ్ అంతా ‘ప్రాజెక్ట్ కె’ సినిమా కోసం భారీగానే ప్లాన్ చేస్తునట్టు కనిపిస్తోంది. దీంతో ఆ వీడియోను చూసిన నెటిజన్లు ‘ఫస్ట్ లుక్ పోస్టర్’ అనౌన్స్‌మెంట్ ఇవ్వండి అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

Next Story