- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
'నాటు నాటు'కు గోల్డెన్ గ్లోబ్ అవార్డు.. మోడీ ఆసక్తికర ట్వీట్ (వీడియో)
దిశ, వెబ్ డెస్క్: ఆర్‌ఆర్‌ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ అవార్డు రాగా ప్రధాని మోడీ సినిమా బృందాన్ని అభినందిస్తూ ట్వీట్ చేశారు. భారతీయులను గర్వపడేలా చేశారని ఆర్‌ఆర్‌ఆర్ బృందాన్ని ప్రశంసించారు. ఎంఎం కీరవాణి, ప్రేమ్ రక్షిత్, రాహుల్ సిప్లిగంజ్, చంద్రబోస్, కాలభైరవ, ఎస్ ఎస్ రాజమౌళి, తారక్, రామ్ చరణ్ మరియు చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు. ఈ మేరకు అవార్డు ప్రకటించిన సందర్భంగా రాజమౌళి, ఎన్టీఆర్, రాంచరణ్‌లు చప్పట్లు కొడుతున్న వీడియోను ప్రధాని మోడీ తన ట్వీట్‌కు జత చేశారు. కాగా పాటకు అవార్డు రావడం పట్ల సినీ పరిశ్రమ నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ట్విట్టర్ వేదికగా ప్రముఖ సంగీత దర్శకుడు ఏ ఆర్ రెహమాన్, డైరెక్టర్ క్రిష్, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ఏపీ సీఎం వైఎస్ జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, హీరో మోహన్ బాబు, రవితేజ, నాగార్జున, అల్లరి నరేష్, మంచు విష్ణు, ప్రముఖ సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్, హీరోయిన్ అనుష్క, ప్రముఖ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ, నందినిరెడ్డిలు ట్విట్టర్ వేదికగా ఆర్‌ఆర్‌ఆర్ చిత్రబృందానికి అభినందనలు తెలిపారు.