'God Father' టీజర్‌.. మెగా ఫ్యాన్స్‌కు పండగే!

by Hamsa |   ( Updated:2022-08-18 08:13:21.0  )
God Father టీజర్‌.. మెగా ఫ్యాన్స్‌కు పండగే!
X

దిశ, సినిమా: మెగాస్టార్ చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'గాడ్ ఫాదర్'. మాలీవుడ్ ఫిల్మ్ 'లూసిఫర్' రీమేక్‌గా తెరకెక్కుతున్న సినిమాలో చిరంజీవితో పాటు సల్మాన్ ఖాన్, నయనతార కీలకమైన పాత్రలో నటిస్తుండగా.. దర్శకుడు పూరీ జగన్నాధ్ కూడా అతిథి పాత్రలో అలరించనున్నాడని తెలుస్తోంది.

ఇక ఇప్పటి వరకు రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ ప్రోమో మెగా ఫ్యాన్స్‌కు కిక్ ఇవ్వగా.. మేకర్స్ న్యూ అప్‌డేట్ అభిమానులు పండగ చేసుకునేలా చేస్తోంది. ఆగస్టు 21న చిరు పుట్టినరోజు సందర్భంగా 'గాడ్ ఫాదర్' టీజర్ రిలీజ్‌ చేయనుందని ప్రకటించడంతో సెలబ్రేషన్స్‌కు సిద్ధమవుతున్నారు ఫ్యాన్స్.

Advertisement

Next Story