- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Ram Charan: రాజమౌళి డాక్యుమెంటరీపై గ్లోబల్ స్టార్ రియాక్షన్.. ఇదే అసలైన గౌరవం అంటూ ఆసక్తికర పోస్ట్
దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి ఎన్నో హిట్ చిత్రాలు తెరకెక్కించి ప్రేక్షకుల మనసులు గెలుచుకున్నారు. అంతేకాకుండా ఆయన దర్శకత్వం వహించిన ఈగ, బాహుబలి-1 పార్ట్ 2 ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ఆదరణ పొందాయి. అంతేకాకుండా పలు అవార్డులు కూడా వచ్చాయి. అయితే రాజమౌళి 2022లో తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ బ్లాక్ బస్టర్ హిట్ సాధించడంతో పాటుగా ఏకంగా ఆస్కార్ అవార్డులు సొంతం చేసుకుని రికార్డు సృష్టించాయి. అంతేకాకుండా ఇందులో నటించిన నటీనటులకు, నాటు నాటు పాట పాడిన సింగర్ రాహుల్ సిప్లీగంజ్, రాజమౌళికి పాపులారిటీ మరింత రెట్టింపు అయిందనడంలో అతిశయోక్తి లేదు.
ఇటీవల ఆయన కల్కి సినిమాలో కీలక పాత్రలో నటించి మెప్పించారు. ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి మెడ్రన్ మాస్టర్స్ అనే డాక్యుమెంటరీ రూపొందించిన సంగతి తెలిసిందే. ఇది ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అందుబాటులోకి వచ్చి మంచి ప్రేక్షకాదరణను సొంతం చేసుకుంది. ఈ క్రమంలో.. తాజాగా, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ రాజమౌళి డాక్యుమెంటరీపై ఇన్‌స్టా వేదికగా రియాక్ట్ అవుతూ ఆసక్తికర పోస్ట్ పెట్టాడు. ‘‘రాజమౌళి సినిమాలపై కథలపై ఉన్న అంకితభావం ఎంతో మందికి స్పూర్తిదాయకం. ఈ మోడ్రన్ మాస్టర్స్ డాక్యుమెంటరీ ఆయన కెరీర్‌కు మనమిచ్చే అసలైన గౌరవం’’ అని రాసుకొచ్చాడు.
ప్రజెంట్ రామ్ చరణ్ పోస్ట్ వైరల్ అవుతుండగా.. అది చూసిన వారంతా ఆగస్టు 15 వస్తుంది అన్నా ఏదైనా సినిమా నుంచి పోస్టర్ విడుదల చేయమని రిక్వెస్ట్ చేస్తున్నారు. కాగా, ప్రస్తుతం రామ్ చరణ్ శంకర్ డైరెక్షన్‌లో గేమ్ ఛేంజర్ చేస్తున్నాడు. ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ మొదలై మూడేళ్లు పూర్తి కావొస్తున్నప్పటికీ విడుదల మాత్రం కాలేదు. బుచ్చిబాబు, రామ్ చరణ్ కాంబోలో ఓ మూవీ రాబోతుంది. ఇందులో బాలీవుడ్ యంగ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా అయిపోయాయి. కానీ షూటింగ్ మాత్రం మొదలు కాలేదు.
Read More..
బంపర్ ఆఫర్ ప్రకటించిన కల్కి డైరెక్టర్ నాగ్ అశ్విన్.. పోస్ట్ వైరల్
(Video Link Credits to always ramcharan Instagram Channel)