అరాచకం.. గూస్ బంప్స్ తెప్పిస్తోన్న పవన్ OG గ్లింప్స్ (వీడియో)

by Hamsa |   ( Updated:2023-10-10 15:15:17.0  )
అరాచకం.. గూస్ బంప్స్ తెప్పిస్తోన్న పవన్ OG గ్లింప్స్ (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్, డైరెక్టర్ సుజిత్ కాంబినేషన్‌లో ‘రియల్ గ్యాంగ్‌స్టర్’ (OG) పేరుతో ఓ చిత్రం వస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా నుంచి ఇప్పటి వరకు ఫస్ట్ లుక్, టీజర్ విడుదల చేయపోవడంతో ఫ్యాన్స్ నిరాశ చెందారు. అయితే ఈ రోజు పవన్ కల్యాణ్ పుట్టిన రోజు కావడంతో చిత్రయూనిట్ అదిరిపోయే అప్డేట్ ఇచ్చి ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఓజీ ఫస్ట్ గ్లింప్స్‌ రిలీజ్ అయింది. పవన్ ఎలివేషన్స్, ధమన్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సినిమాపై భారీ అంచనాలను పెంచేశాయి. అందులో పవన్ గ్యాంగ్‌స్టర్‌గా అదరగొట్టేశాడు. దీంతో పవన్‌ను చూసి ఫుల్ ఖుష్ అవుతున్నారు. అంతేకాకుండా ఈ సారి బాక్సాఫీసును బద్దలు కొట్టడం ఖాయమని అంటున్నారు.

Advertisement

Next Story

Most Viewed