సయామికీ స్వయంగా లెటర్ రాసి పంపిన Amithab.. ఆనందంతో నెట్టింట పోస్ట్ చేసిన నటి

by Prasanna |   ( Updated:2023-08-21 15:41:10.0  )
సయామికీ స్వయంగా లెటర్ రాసి పంపిన Amithab.. ఆనందంతో నెట్టింట పోస్ట్ చేసిన నటి
X

దిశ, సినిమా: ‘ఘూమర్’లో తన నటనను మెచ్చుకుంటూ అమితాబ్ బచ్చన్ స్వయంగా చేతితో రాసి పంపించిన ప్రశంసపత్రాన్ని అభిమానులతో షేర్ చేసుకుంది సయామి ఖేర్. మెల్‌బోర్న్‌లో జరిగిన ‘ఘూమర్’ ప్రీమియర్‌ షో చూసి అందరూ ఏడ్చారని చెప్పిన నటి.. ‘నీవు మాకు చాలా ఎమోషన్ చూపించావ్ ఖేర్ సాబ్’ అంటూ బిగ్‌బీ తనను కౌగిలించుకున్నాడని గుర్తు చేసుకుంది. ఈ క్రమంలోనే మళ్లీ తనను పొగడకుండా ఉండలేకపోయిన అమితాబ్ సర్ స్పెషల్ బొకే పంపించినట్లు చెబుతూ.. ‘నిన్న ఉదయం పూల గుత్తి, అమితాబ్ చేతితో రాసిన నోట్‌ను డెలివరీ బాయ్ ఇవ్వగానే ఆశ్చర్యపోతూనే ఇంట్లోకి వచ్చి కూర్చున్న. దాన్ని ఓపెన్ చేసేంతవరకూ నా గుండె వేగంగా కొట్టుకుంది. ఇందులో ‘అభిమానంతో మీకు స్పెషల్ గ్రీటింగ్. ఘూమర్‌లో మీ కమిట్‌మెంట్, పనితీరు ఎంతో ప్రకాశవంతమైనది. మీకు లభించే ఈ ప్రశంసలు ఎన్నటికీ తగ్గకుండా చూసుకోండి’ అంటూ పొగడేసిన లేఖను చదువుతుంటే ఎంతో హ్యాపీగా అనిపించింది’అని చెప్పింది. చివరగా తాను అనుకున్నది ఇదేనా? ప్రతి నటీనటుడు కలలు కనే ఆమోద ముద్ర ఇదేనని మనసులో అనుకుంటూ ఆకాశం వైపు చూస్తూ భావోద్వేగానికి గురయ్యానని తెలిపింది.

ఇవి కూడా చదవండి : అన్నయ్య మెగాస్టార్‌కు.. తమ్ముడు పవన్ కల్యాణ్ బర్త్‌డే విషెస్

Advertisement

Next Story

Most Viewed