- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Naga Chaitanya-Sobhita: త్వరలో నాగచైతన్యతో పెళ్లి.. పిల్లలను కనడంపై శోభిత షాకింగ్ కామెంట్స్?
దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరోయిన్ శోభిత ధూళిపాళ, అక్కినేని హీరో నాగచైతన్య గత కొద్ది కాలంగా సీక్రెట్ లవ్ స్టోరీ నడిపించారు. ఇటీవల పెద్దలను ఒప్పించి ఆగస్టు 8న నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని తెలుపుతూ నాగార్జున ట్విట్టర్ వేదికగా ఫొటోలు షేర్ చేయడంతో అవి చూసిన వారంతా షాక్‌కు గురయ్యారు. ఇక చైతుతో ఎంగేజ్‌మెంట్ తర్వాత శోభిత పాపులారిటీ మరింత పెరిగింది. ఆమె ఏ పోస్ట్ పెట్టినా సోషల్ మీడియాలో నిమిషాల్లో వైరల్ అవుతుందనడంలో అతిశయోక్తి లేదు. ప్రజెంట్ ఈ అమ్మడు ‘లవ్ సితార’ ఓటీటీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ చిత్రం సెప్టెంబర్ 27న స్ట్రీమింగ్ అందుబాటులోకి రాబోతుంది.
ఈ క్రమంలో.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శోభిత పిల్లలను కనడం గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది. ‘‘నా నిశ్చితార్థం పెళ్లి గ్రాండ్ చేసుకోవాలని అనుకోలేదు. అలాంటి కలలు కనలేదు. సాంప్రదాయంగా సింపుల్‌గా జరిగితే చాలు అనుకున్నాను ఎంగేజ్‌మెంట్ చేసుకున్నా. నేను పెళ్లి చేసుకోవాలి, పిల్లలను కనాలి అనుకునేదాన్ని. మాతృత్వంలోని అనుభూతిని నేను పొందాలి అనుకుంటున్నాను. అలాగే నా పేరెంట్స్, సంస్కృతి సంప్రదాయాలను గౌరవిస్తాను.
అందుకే నేను ఎంత ఎదిగినప్పటికీ నాకు సంబంధించిన వన్నీ సంప్రదాయ పద్ధతిలో నా తల్లిదండ్రుల సమక్షంలో జరగాలని అనుకుంటాను’’ అని చెప్పుకొచ్చింది. తల్లి అయితే బాడీ షేప్ అవుట్ అయిపోతుందని చాలా మంది పిల్లలను కనడానికి ఇష్టపడట్లేదు. కానీ శోభిత అందుకు భిన్నంగా కామెంట్స్ చేయడంతో అంతా షాక్ అవుతున్నారు. అయితే నిశ్చితార్థం సమయంలో నాగచైతన్యకు పిల్లలు పుట్టే అవకాశం లేదని వేణు స్వామి చెప్పిన విషయం తెలిసిందే. దీనిపై పెద్ద దుమారమే అయింది. ఆయనపై కేసు కూడా నమోదు కావడంతో సెలబ్రిటీలకు సంబంధించిన వారి జాతకాలు చెప్పను అని ప్రకటించారు.