- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
samantha: గెట్ రెడీ సంథింగ్ స్పెషల్ రాబోతుందంటూ సమంత పోస్ట్.. పర్సనల్ లైఫ్ గురించేనా?
దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత నాగచైతన్యను పెళ్లి చేసుకుంది. కానీ వీరిద్దరి కాపురం ఎక్కువ కాలం కొనసాగకపోవడంతో విడాకులు తీసుకుని విడిపోయారు. ఆ తర్వాత నుంచి సామ్, చైతు ఎవరి లైఫ్ వారు చూసుకుంటున్నారు. అయితే వారు విడిపోయారు మూడేళ్లు కావొస్తుంది. అయినప్పటికీ వీరిద్దరి గురించి పలు వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. ఇక సమంతకు మయోసైటీస్ రావడంతో పూర్తిగా సినిమాలకు దూరం అయి సోషల్ మీడియాలో పలు పోస్టులు పెడుతూ హెల్త్ విషయాలు చెబుతుంది.
అయితే నాగచైతన్య మాత్రం సినిమాల్లో నటిస్తున్నాడు. ఇటీవల సడెన్‌గా యంగ్ బ్యూటీ శోభితతో నిశ్చితార్ధం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని నాగార్జున ట్విట్టర్ వేదికగా ప్రకటించడంతో అంతా షాక్ అయ్యారు. ఇక వారం రోజుల పాటు వీరిద్దరు గురించి చర్చలు జరిగాయి. ఇదిలా ఉంటే.. సమంత కూడా ఓ స్టార్ డైరెక్టర్‌తో డేటింగ్‌లో ఉన్నట్లు నెట్టింట పుకార్లు షికారు చేస్తున్నాయి. కానీ ఫ్యాన్స్ మాత్రం అందులో ఎలాంటి నిజం లేదని అంటున్నారు. అయితే ఇలాంటి సమయంలో సమంత పోస్టులు ఆసక్తిరి రేకెత్తిస్తున్నాయి. ఇక వాటిని చూసిన వారు రకరకాలుగా చర్చించుకుంటున్నారు.
తాజాగా, సమంత తన ఇన్‌స్టా వేదికగా స్పెషల్ న్యూస్ రాబోతున్నట్లు ప్రకటించి ఫ్యాన్స్‌ను అయోమయంలో పడేసింది. ‘‘రెడీగా ఉండండి ఈ రోజు సంథింగ్ స్పెషల్ రాబోతుంది’’ అని రాసుకొచ్చింది. అలాగే ఓ వాడిపోయిన ఆకులున్న కొమ్మ పిక్‌ను పెట్టింది. ప్రస్తుతం సమంత పోస్ట్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. అది చూసిన కొందరు బిజినెస్ అప్డేట్ ఇస్తుందా? లేక తన పర్సనల్ లైఫ్ గురించి చెప్తుందా అని మాట్లాడుకుంటున్నారు. అలాగే నాగచైతన్య లాగా, సమంత కూడా నిశ్చితార్ధం చేసుకుని చెప్తుందా? అదే స్పెషల్ న్యూస్ చెప్పనుందా అని చర్చలు జరుగుతున్నాయి. కానీ ఫ్యాన్స్ మాత్రం కొత్త సినిమా గురించి చెప్తుందని అంటున్నారు.
- Tags
- samantha