ఓటీటీలో వచ్చే సినిమా, సిరీస్‌లను ఫ్యామిలీతో చూడలేకపోతున్నాం.. జెనీలియా షాకింగ్ కామెంట్స్

by Anjali |   ( Updated:2023-07-21 11:13:16.0  )
ఓటీటీలో వచ్చే సినిమా, సిరీస్‌లను ఫ్యామిలీతో చూడలేకపోతున్నాం.. జెనీలియా షాకింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా: బాలీవుడ్ నటుడు, భర్త రితేశ్ దేశముఖ్‌తో కలిసి సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన జెనీలియా ప్రస్తుతం వరుస సినిమాలు, వెబ్ సిరీస్‌లతో దూసుకుపోతుంది. గతేడాది రితేశ్‌తో కలిసి ‘మిస్టర్‌ మమ్మీ’, ‘వేడ్’ సినిమాలతో అలరించిన నటి.. ఇప్పుడు ఓటీటీలో అరంగేట్రం చేయడానికి సిద్ధమైంది. ఆమె ప్రధాన పాత్రలో నటించిన తాజా వెబ్ సిరీస్ ‘ట్రయల్‌ పీరియడ్‌’ జూలై 21 నుంచి జియో సినిమా వేదికగా ప్రసారం అవుతుంది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ‘ఈ సిరీస్‌ మొత్తం ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌. కథను గంటలో చదివేసి ఓకే చేశాను. నాకు స్టోరీ చాలా ఆసక్తిగా అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు ఓటీటీలో కుటుంబమంతా కలిసి చూసే కథలు తగ్గిపోయాయని నా అభిప్రాయం. అంతేకాదు ఇంట్లో పిల్లలతో కలిసి మేం చాలా సినిమాలు చూడలేకపోతున్నాం. అందుకే కుటుంబమంతా కలిసి చూసే ఈ ట్రయల్‌ పీరియడ్‌ కథ చేయాడానికి ఏ మాత్రం వెనకాడలేదు’ అంటూ పలు విషయాలు ప్రస్తావించింది.

Read more : disha newspaper

Movie News & Gossips

Advertisement

Next Story

Most Viewed