Geethu Royal: నా బిడ్డను చంపేశారంటూ గుండె పగిలేలా రోదిస్తున్న గీతు రాయల్.. వీడియో వైరల్

by Kavitha |
Geethu Royal: నా బిడ్డను చంపేశారంటూ గుండె పగిలేలా రోదిస్తున్న గీతు రాయల్.. వీడియో వైరల్
X

దిశ, సినిమా: బిగ్‌బాస్ ఫేమ్ గీతూ రాయల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈమె సోషల్ మీడియా ఇన్ఫ్లున్సర్‌గ పలు వీడియోలు చేస్తూ ఫేమస్ అయి బిగ్‌బాస్ హౌజ్‌లోకి వెళ్లే ఛాన్స్ కొట్టేసింది. అలా సీజన్ 6లో కంటెస్టెంట్‌గా అడుగుపెట్టిన గీతూ తన గేమ్స్‌తో ఒక దశలో ఆమె టాప్ కంటెస్టెంట్‌గా బిగ్ బాస్ హౌస్‌ని శాసించింది. దీంతో బిగ్‌బాస్ విన్నర్ గీతూ రాయల్ అవుతదని అందరు అనుకున్నారు. కానీ, బిగ్ బాస్ ఆదేశాలు పక్కన పెట్టి తన రూల్స్‌తో గేమ్స్ స్టార్ట్ చేసింది.. దీంతో ఒకటి రెండు సార్లు బిగ్‌బాస్ హెచ్చరించినా తన పద్దతి మార్చుకో కపోవడంతో జనాలకు కూడా గీతూ రాయల్ తీరు నచ్చకపోవడంతో గుడ్ బై చెప్పేశారు. కాగా సీజన్ 7 బిగ్ బాస్ బజ్ హోస్ట్‌గా గీతూ రాయల్ వ్యవహరించింది.

ఇదిలా ఉంటే తాజాగా గీతూ రాయల్‌ తన పెంపుడు పిల్లి అయిన ఓరియో బంగారం.. నా బిడ్డ లేదు.. ఐ లవ్ యు.. అంటూ చివరి సారి తనను సమాధి చేస్తూ ఏడ్చేసింది. తనతో సంతోషంగా ఉన్న రోజులను గుర్తు చేసుకుంటూ అందుకు సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది.

ఆ వీడియో ప్రకారం.. “2021, డిసెంబర్‌ 13న ఓరియో మా కుటుంబంలోకి వచ్చింది. ఈ ఏడాది జూలై 27న శాశ్వతంగా అందరినీ వదిలి వెళ్ళిపోయింది. నా పిల్లి చాలా అమాయకమైనది. దీనికి కనీసం ఎలా అరవాలో, కరవాలో కూడా తెలియదు. రోజూలాగే జూలై 27న ఉదయం 3.45 గంటలకు బయట వీధిలోకి వెళ్లింది. 5.30 కల్లా ఇంటికి తిరిగొచ్చేది. కానీ ఆరోజు రాలేదు. సాయంత్రం నాలుగు వరకు వెతుకుతూనే ఉన్నాం.చివరికి అది చనిపోయి కనిపించింది. సెక్యూరిటీ గార్డుల నిర్లక్ష్యం వల్ల వీధి కుక్కలు కమ్యూనిటీ లోపలకు వచ్చాయి. నా బిడ్డను వెంటాడి మరీ చంపేశాయి. ఆ సమయంలో తను ఎంత భయపడిపోయిందో ఊహించుకోవడానికే కష్టంగా ఉంది. ఓరియో పడ్డ వేదనను తలుచుకుంటేనే కష్టంగా ఉంది. ఓరియో అంటే నాకు ప్రాణం.. దాన్ని ఎంతగానో మిస్‌ అవుతున్నాను. ఓరియో నాన్న... వీలైతే తిరిగొచ్చేయు బంగారు కొండ.. మమ్మా నిన్ను ఎంతో ప్రేమిస్తోంది అని గీతూ రాయల్ రాసుకొచ్చింది”. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.

కాగా గీతు బిగ్‌బాస్‌ షోలో ఉన్నప్పుడు కూడా ఇంటి నుంచి ఏం కావాలంటే ఓరియో బొచ్చు కావాలని అడిగిన విషయం అప్పట్లో తెగ వైరల్ అయిన సంగతి తెలిసిందే.

(video link credits to geethu royal instagram id)

Advertisement

Next Story

Most Viewed