రామ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. బిగ్ అప్‌డేట్ ఇచ్చిన Gautham Menon

by sudharani |   ( Updated:2022-09-15 14:32:16.0  )
రామ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. బిగ్ అప్‌డేట్ ఇచ్చిన Gautham Menon
X

దిశ, సినిమా: యంగ్ హీరో రామ్ పోతినేని అభిమానులకు అదిరిపోయే అప్‌డేట్ వచ్చింది. ఈ మధ్య ఒక్క హిట్ లేక సతమతమవుతున్న హీరోకు బిగ్ హిట్ ఇచ్చేందుకు స్టార్ డైరెక్టర్ గౌతమ్ మీనన్ రెడీగా ఉన్నట్లు తెలిపాడు. రీసెంట్‌గా వచ్చిన 'సీతా రామం' సినిమాలో కీలక పాత్రలో నటించిన గౌతమ్.. త్వరలోనే రామ్‌తో సినిమా చేయబోతున్నట్లు ప్రకటించాడు. ఈ మేరకు శింబు హీరోగా నటించిన 'వెందు తనిధాతు కాడు' మూవీ తెలుగులో 'ది లైఫ్ ఆఫ్ ముత్తు' పేరుతో రిలీజ్ కాగా.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రామ్‌తో కలిసి పనిచేయబోతున్నానంటూ అధికారికంగా ప్రకటించి సర్ ప్రైజ్ ఇచ్చాడు. అంతేకాదు వచ్చే ఏడాది ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళుతుందని, స్రవంతీ మూవీస్ బ్యానర్‌పై స్రవంతి రవికిషోర్ నిర్మించబోతున్నట్లు తెలిపాడు. ఇక ఈ గుడ్ న్యూస్‌తో హీరో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతుండగా ఇందుకు సంబంధించిన వార్త నెట్టింట హల్ చల్ చేస్తోంది.

వందకు పైగా దేశాల్లో 'విక్రమ్ వేద'.. రికార్డ్ స్థాయిలో రిలీజ్

Advertisement

Next Story