Ram Charan ‘గేమ్ చేంజర్’ సాంగ్ లీక్ చేసిన ఇద్దరు అరెస్ట్..

by Anjali |   ( Updated:2023-11-06 13:10:21.0  )
Ram Charan ‘గేమ్ చేంజర్’ సాంగ్ లీక్ చేసిన ఇద్దరు అరెస్ట్..
X

దిశ, సినిమా: గ్లోబ‌ల్‌ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోగా శంక‌ర్ ద‌ర్శక‌త్వంలో రూపొందుతున్న భారీ బ‌డ్జెట్ చిత్రం ‘గేమ్ చేంజ‌ర్‌’. ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంక‌టేశ్వర సినీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్ నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీలో కియారా అద్వానీ, అంజ‌లి, సముద్రఖ‌ని, ఎస్‌.జె.సూర్య, శ్రీకాంత్‌, సునీల్‌, న‌వీన్ చంద్ర త‌దిత‌రులు ముఖ్యపాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జరుగుతుంది. చ‌ర‌ణ్‌ను మంచి పవరఫుల్ రోల్‌లో ప్రెజెంట్ చేయబోతున్నారు శంక‌ర్‌.

ఇకపోతే ఈ మూవీ నుంచి ఇప్పటికే అనుకోకుండా కొన్ని అప్‌డేట్స్ లీక్ అయిన విషయం తెలిసిందే. మామూలుగా ఫొటోలు, షూటింగ్ వీడియోలు లీక్ అవుతుంటాయి. కానీ ఏకంగా ఓ పాటనే లీక్ చేశారు. దీంతో నిర్మాత దిల్ రాజు ఆగ్రహం వ్యక్తం చేస్తూ సాంగ్ లీక్‌పై సైబర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై దర్యాప్తు చేసిన పోలీసులు.. తాజాగా ఈ నేరానికి పాల్పడిన ఇద్దరిని అరెస్ట్ చేశారు. సెక్షన్ 66సీ, 66ఆర్/డబ్ల్యూ కింద కేసు నమోదు చేశారు.

Advertisement

Next Story