Ram Charan Game Changer :‘గేమ్ ఛేంజర్’ నెక్ట్స్ షెడ్యూల్ ఎక్కడో తెలుసా.?

by sudharani |   ( Updated:2023-11-21 14:04:34.0  )
Ram Charan Game Changer :‘గేమ్ ఛేంజర్’ నెక్ట్స్ షెడ్యూల్ ఎక్కడో తెలుసా.?
X

దిశ, వెబ్‌డెస్క్: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా ‘గేమ్ చేంజర్’. ప్రస్తుతం మెగా అభిమానుల దృష్టి మొత్తం ఈ మూవీ పైనే ఉంది. కియారా అద్వాని హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీ పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులను పలకరించనుంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకి సంబంధించిన షెడ్యూల్ కొన్ని రోజులుగా హైదరాబాదులో జరుగుతూ వచ్చింది. ఇక్కడ కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించిన చిత్ర బృందం.. ఇప్పుడు నెక్ట్స్ షెడ్యూల్‌కి సన్నాహాలు చేసుకుంటునట్లు తెలుస్తోంది. ఈ మేరకు ‘గేమ్ చేంజర్’ నెక్ట్స్ షెడ్యూల్‌ను మైసూర్‌లో ప్లాన్ చేశారు. ఈనెల 23 వ తేదీ నుంచి ఈ ఫెడ్యూల్‌కి సంబంధించిన చిత్రీకరణ మొదలవుతుందని తెలుస్తోంది. కాగా.. ఈ సినిమాలో శ్రీకాంత్, ఎస్.జె. సూర్య, సునీల్, సముద్ర ఖని, అంజలి ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు.

Advertisement

Next Story