Roja : దారుణమైన పరిస్థితుల్లో మాజీ మంత్రి, నటి రోజా.. అవకాశాల కోసం అలా చేస్తుందా?

by Jakkula Samataha |
Roja : దారుణమైన పరిస్థితుల్లో మాజీ మంత్రి, నటి రోజా.. అవకాశాల కోసం అలా చేస్తుందా?
X

దిశ, సినిమా : సీనియర్ నటి, మాజీ మంత్రి రోజా సెల్వమణి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇటు చిత్ర పరిశ్రమలో, అటు రాజకీయాల పరంగా ఈమె మంచి గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా నటిగా ఈమెకు ఉన్న ఫేమ్ గురించి ఎంత చెప్పినా తక్కువే, బాలకృష్ణ, చిరంజీవి, శ్రీకాంత్ సరసన చాలా సినిమాల్లో నటించింది. తమిళ, తెలుగు బాషాల్లో ఓ రికార్డే క్రియేట్ చేసిందని చెప్పాలి. ఇక తర్వాత రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి, ఓవైపు రాజకీయాలు మరో వైపు అమ్మ, అత్త క్యారెక్టర్స్, బుల్లితెరపై పలు షోల్లో కూడా చేస్తూ వచ్చింది. ముఖ్యంగా మోడ్రన్ మహాలక్ష్మి, జబర్దస్త్ షోలు రోజాకు మంచి ఫేమ్ తీసుకొచ్చాయి. ఇక ఈమె ఇండస్ట్రీలో పలు క్యారెక్టర్స్‌‌తో తన అభిమానులను ఎంటర్టైన్ చేస్తుందని అందరూ భావించారు. కానీ ఊహించని విధంగా ఈమె నెగిటివిటిని మూటగట్టుకుంది. 2019లో ఎమ్మెల్యే, తర్వాత మంత్రి అయిన తర్వాత రోజాపై రోజు రోజుకు నెగిటివిటీ అనేది పెరిగిపోయింది. ముఖ్యంగా 2024 ఎన్నికల ప్రచారంలో ఆమె మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్, చివరకు రజినీకాంత్‌పై కూడా పలు అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఈమెపై అభిమానులు మండిపడుతున్నారు. అంతే కాకుండా ఇండస్ట్రీ నుంచి వచ్చి, ఇండస్ట్రీకి చెందిన హీరోలపై నెగటివ్ కామెంట్స్ చేయడంతో రోజాకు చిత్ర పరిశ్రమలో ఎవరూ సపోర్ట్ చేయనట్లు తెలుస్తోంది.

మంత్రిగా ఉన్నప్పుడు అధికారంతో, మళ్లీ తన పార్టీనే ఫామ్‌లోకి వస్తుందని, ఆమె ఎమ్మెల్యేగా గెలుస్తుందని భావించి ఎలా పడితే అలా మట్లాడింది. కానీ ఊహించని విధంగా రోజా ఓటమి పాలైంది. అయితే ఆ షాక్ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకున్న రోజా, బుల్లితెర, వెండితెరపై అవకాశాల కోసం ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. కానీ ఆమెకు ఎవరూ అవకాశం ఇవ్వడం లేదంట. ముఖ్యంగా తెలుగులో ఆమె అవకాశాల కోసం ఎవరికి కాల్ చేసినా, అందరూ మొహం మీదనే కాల్ కట్ చేస్తున్నారంట. దీంతో రోజా తమిళనాడులో ట్రై చేస్తున్నట్లు తెలుస్తోంది. కానీ అక్కడ కూడా తనకు సరైన రెస్పాన్స్ రావడం లేదు అంటూ పలు రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇక ఇందులో ఎంత నిజం ఎంత ఉందో తెలియదు కానీ, దీనిపై చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. పాపం రోజా పరిస్థితి ఇంత దారుణంగా మారిపోయిందా అందుకే ఎలా పడితే అలా మాట్లాడకూడదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

Next Story