వాళ్లందరి బట్టలు ఉతికి, వంట చేసి పెట్టేవాడిని: వేణు

by sudharani |   ( Updated:2023-03-13 12:40:34.0  )
వాళ్లందరి బట్టలు ఉతికి, వంట చేసి పెట్టేవాడిని: వేణు
X

దిశ, సినిమా: కమెడియన్‌ వేణు దర్శకుడిగా మారి తొలి ప్రయత్నంగా తెరకెక్కించిన చిత్రం ‘బలగం’. పల్లె వాతావరణం, బందాలు, విలువలు చూపిస్తు మూవీని చక్కగా తీర్చిదిద్దారు. కాగా తాజా ఇంటర్వ్యూలో వేణు తన కెరీర్ ఎదుగుదలకోసం అనుభవించిన బాధలను అభిమానులతో పంచుకున్నాడు. ‘సినిమాల్లో నటించాలనేది నా ఆశయం. ఆ పట్టుదలతో చాలా పనులు చేశాను. కొంతకాలానికి నాకు అర్థమైన విషయం ఏమిటంటే.. సినిమాల్లోకి వెళ్లాలంటే సెలబ్రిటీలతో పరిచయం ఉండాలని. అలా కొంతమందిని వెతికి పట్టుకుని, ఒక రూమ్ బాయ్‌గా వారితో ఉన్నాను. వాళ్లందరికీ వంట చేసి బట్టలు ఉతికాను. తర్వాత ‘చిత్రం’ శ్రీను దగ్గర రెండేళ్లు పనిచేశాను. రోజుకు 70 ఇచ్చే కూలీపనులు చేశాను. అన్నదానం జరిగే చోట తినీ, అరుగుల మీద పడుకునే వాడిని’ అంటూ గతాన్ని గుర్తుచేసుకున్నాడు.

Advertisement

Next Story

Most Viewed