‘Shaakuntalam’లో సమంత అనుభవాలు.. మేకప్‌తో కవర్ చేసింది..

by Anjali |   ( Updated:2023-04-10 14:11:33.0  )
‘Shaakuntalam’లో సమంత అనుభవాలు.. మేకప్‌తో కవర్ చేసింది..
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత నటిస్తున్న తాజా చిత్రం ‘శాకుంతలం’. గుణ‌శేఖ‌ర్ ద‌ర్శక‌త్వం వ‌హించిన ఈ మూవీ ఈ నెల 14న విడుద‌ల కానుంది. ఈ సందర్భంగా మూవీ టీం సాలిడ్ ప్రమోషన్స్ నిర్వహిస్తోంది. సమంత కూడా చురుగ్గా పాల్గొంటుంది. ఈ క్రమంలో అభిమానులతో కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ పంచుకుంటూ ఓ వీడియో షేర్ చేసింది. ‘ముందు నుంచి నాకు పువ్వులు అంటే అలెర్జీ కానీ ఈ సినిమాలో ఓ సీన్ కోసం చేతికి పువ్వులు పెట్టుకోవాల్సి వచ్చింది.

అప్పటి వరకు బాగానే ఉంది కానీ తర్వాత ఆ మచ్చలు అలాగే ఉండిపోవడంతో చాలా బాధపడాల్సి వచ్చింది. ఈ మచ్చ ప్లేస్‌ను మేకప్‌తో మేనేజ్ చేశా. తర్వాత ఈ సినిమాకి మొత్తం మూడు భాషల్లో తెలుగు, తమిళ్, హిందీలో డబ్బింగ్ చెప్పుకోవడం కష్టంగా అనిపించింది. ఇంకో విషయం ఏంటంటే సినిమాలో నా చుట్టూ ఉన్న కుందేళ్లలో ఒక్కటి నన్ను కరిచింది. ఇక ముఖ్యంగా ఈ సినిమాలో కాస్ట్యూమ్స్ పెద్ద తలనొప్పి. ఓ సాంగ్‌లో అయితే ఏకంగా 30 కేజీల లెహంగా వేసుకున్నా. ఆ బరువుతో రౌండ్‌గా తిరిగే సీన్ చేయాల్సి ఉంది. తిరిగి ఆగితే డ్రెస్ నన్ను పక్కకు లాక్కుపోయింది. ఫైనల్‌గా ఈ సినిమాలో నాకు ఉన్న జుట్టు ఒరిజినల్ జుట్టు కాదు’ అంటూ తన ఫన్నీ మూమెంట్స్ పంచుకుంది సమంత.

Read more:

ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్‌గా చైతు-సామ్ కథ

Advertisement

Next Story