ఎట్టకేలకు రష్మిక, రౌడి బాయ్ పర్సనల్‌ విషయాలు లీక్‌ చేసిన ఆనంద్‌ దేవరకొండ.. నువ్వు నా ఫ్యామిలీ రా అంటూ

by Kavitha |   ( Updated:2024-05-28 10:37:03.0  )
ఎట్టకేలకు రష్మిక, రౌడి బాయ్ పర్సనల్‌ విషయాలు లీక్‌ చేసిన ఆనంద్‌ దేవరకొండ.. నువ్వు నా ఫ్యామిలీ రా అంటూ
X

దిశ, సినిమా: నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్నా, రౌడీ బాయ్‌ విజయ్‌ దేవరకొండ మధ్య లవ్‌ ట్రాక్‌ నడుస్తుందని అటు ఇండస్ట్రీ, ఇటు సోషల్‌ మీడియాలోను హాట్ టాపిక్‌గా నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా రష్మిక మందన్నా ఆనంద్‌ దేవరకొండ హీరోగా, ఉదయ్‌ శెట్టి దర్శకత్వంలో, వంశీ కారుమంచి, కేదార్‌ సెలగం శెట్టితో కలిసి నిర్మించిన యాక్షన్‌ క్రైమ్‌ కామెడీ మూవీ గం గం గణేశా చిత్ర. కాగా ఈ నెల 31న ఈ చిత్రం విడుదల కాబోతున్న క్రమంలో సోమవారం సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ నిర్వహించారు. దీనికి రష్మిక గెస్ట్ గా వచ్చి టీమ్‌ని విష్‌ చేసింది. ఇందులో ఆనంద్‌, రష్మిక మధ్య కన్వర్జేషన్‌ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

ఈ సందర్భంగా ప్రమోషన్‌ కోసం చేసిన స్టంట్‌ లో భాగంగా ఆవేశంలో పర్సనల్‌ విషయాలను బయటపెట్టారు ఇద్దరూ. అందులో భాగంగా ఇదే కార్యక్రమంలో రష్మికకు ఆనంద్ దేవరకొండ కొన్ని ప్రశ్నలు అడిగారు. అందులో ముఖ్యంగా మీతో కలిసి నటించిన హీరోల్లో మీ ఫేవరెట్‌ ఎవరు? అని ఆనంద్ అడిగిన ప్రశ్నకు.. రష్మిక తిట్టుకుంటూనే.. ‘ఆనంద్‌.. నువ్వు నా ఫ్యామిలీ ఇలా ఇరికిస్తే ఎలా?’ అని చెప్పగానే.. స్టేజ్ అంతా రౌడీ రౌడీ అనే స్లోగల్‌ వినిపించింది.. ఈ బ్యూటీ కూడా రౌడీనే అని ఆన్సర్ ఇచ్చింది. దీంతో స్టేడియం ఒక్కసారిగా మోత మోగింది.

అదే విధంగా మీరు చాలా ప్లేస్‌లకి వెళ్లినప్పుడు చాలా ఫోటోలను తీస్తారు కదా వీరిలో మీ బెస్ట్ ఫోటోగ్రాఫర్‌ ఎవరని ఫ్రెండ్స్ పేర్లతోపాటు తన పేరు, విజయ్‌ పేరు కూడా చెప్పి వీరిలో ఎవరు అని ఆనంద్ అడగగా. దీనికి రష్మిక మందన్నా నేనే బెస్ట్ ఫోటోగ్రాఫర్‌ అని, ఎన్ని బెస్ట్ ఫోటోస్‌ తీసిన, ఒక్క క్రెడిట్‌ అయినా ఇచ్చినవా నాకు అంటూ నిలదీసింది. ఈ క్రమంలో ఆమె తమ మధ్య ఉన్న ఫ్యామిలీ బాండింగ్‌, పర్సనల్‌ విషయాలు లీక్‌ చేసేశారు. నువ్వు నా ఫ్యామిలీ రా అనేది, కలిసి ట్రావెల్‌ చేస్తారనేది, అలాగే ఫోటోలు తీయడం అనేది ఇలా పలు అంశాల్లో తమ పర్సనల్‌ విషయాలను లీక్‌ చేశారు. ఇదంతా చూసిన వారు.. రష్మిక మళ్లీ హింట్స్ ఇచ్చేసిందంటూ సోషల్ మీడియాలో ఈ వీడియోని షేర్ చేస్తుండటం విశేషం.

Read More..

17 ఏళ్ల వయస్సులోనే బికినీ వేసుకొని ఆ పని చేయాలని అడిగారు.. టీవీ షో నటి షాకింగ్ కామెంట్స్

Advertisement

Next Story

Most Viewed