పాపం అంతమాట అన్నా.. నవ్వేసి ఊరుకున్న కృతిశెట్టి

by Jakkula Samataha |   ( Updated:2024-01-25 15:00:25.0  )
పాపం అంతమాట అన్నా.. నవ్వేసి ఊరుకున్న కృతిశెట్టి
X

దిశ, సినిమా : అందాల ముద్దుగుమ్మ కృతిశెట్టి గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనేలేదు. ఉప్పెన సినిమాతో తెలుగు చిత్రపరిశ్రమలోకి అడుగు పెట్టిన ఈ బ్యూటీ, మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకొని గోల్డెన్ లెగ్ అనిపించుకుంది. జల జల పాతం నువ్వు అంటూ కుర్రకారును తన అందంతో మాయచేసింది.చేసిన మొదటి సినిమానే బ్లాక్ బస్టర్ అవ్వడంతో ఈ అమ్మడుకు ఆఫర్స్ క్యూ కట్టాయి.అప్పట్లో వరస సినిమాలతో బిజీ అయిన ఈముద్దుగుమ్మకు ప్రస్తుతం తెలుగులో ఆఫర్స్ తగ్గినట్లు తెలుస్తుంది. మాచర్ల నియోజకవర్గం లాంటి సినిమాలు ఫ్లాప్ కావడంతో కృతి శెట్టి కాస్త సైలెంట్ అయ్యింది.

ఇక ఏ షాపింగ్ మాల్ ఓపెనింగ్‌లోనైనా సరే కృతిశెట్టినే ఉంటుంది. షాప్ ఓపెనింగ్స్ చేస్తు ఈ భామ తెగ సందడి చేస్తోంది. అయితే తాజాగా ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్‌కు వెళ్లిన నటికి చేధు అనుభవం ఎదురైంది. షాపింగ్ ఓపెనింగ్‌లో తన అభిమానులతో కలిసి ముచ్చటిస్తున్న క్రమంలో , ఓ అభిమాని మీ స్కందా మూవీ చూశాను, బాగుంది అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో కృతికి ఏం చెప్పాలో తెలియక చిన్న నవ్వు నవ్వి, నేను ఆ సినిమాలో నటించలేదండి అని కౌంటర్ ఇచ్చాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

Advertisement

Next Story