మనవళ్లకేనా కొడుక్కి లేదా.. నాగార్జునపై ఫ్యాన్స్ అసహనం

by sudharani |   ( Updated:2023-01-25 07:01:58.0  )
మనవళ్లకేనా కొడుక్కి లేదా.. నాగార్జునపై ఫ్యాన్స్ అసహనం
X

దిశ, వెబ్‌డెస్క్: బాలయ్య బాబు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలోనే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా దుమారం రేపుతున్నాయి. ఇప్పటికే ఈ వ్యాఖ్యలపై పలువురు స్పందించారు. దీనిపై అక్కినేని వారసులు నాగచైతన్య, అఖిల్ కూడా స్పందిస్తూ.. తీవ్రంగా ఖండించారు. అయితే ఇప్పుడు మరో విమర్శ తెరపైకి వచ్చింది. అక్కినేని తొక్కినేని అని నాగేశ్వర రావుని అన్న మాటలకు మనవళ్లు స్పందించారు కానీ కొడుకు నాగార్జున ఇంకా ఎందుకు స్పందించలేదంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

బాలయ్య ఏదో పొరపాటున అనేశాడు అనుకుని ఊరుకున్నారా..? నోరు జారిన బాలయ్య సంస్కారాన్ని ఆయన విజ్ఞాతకే వదిలేసి నాగార్జున మౌనం పాటిస్తున్నారా అంటూ ఫ్యాన్స్ అసంతృప్తి చెందుతున్నారు. మనవళ్ల కంటే ముందు కొడుకుగా తండ్రి మర్యాదను కాపాడాల్సిన బాధ్యత నాగార్జున మీద ఉంది. కొడుకుల కంటే ముందు ఆయనే ఈ వివాదంపై స్పందించాల్సింది అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి ఈ వివాదం ఇంకెంత దూరం వెళుతుందో చూడాలి.

Also Read...

సీఎం బొమ్మను టాటూ వేయించుకున్న హీరో విశాల్..

Advertisement

Next Story