- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Actress Sana: నా కూతురిని దుబాయ్ తీసుకెళ్లి చిత్రహింసలు పెట్టారు..?
దిశ, సినిమా: టాలీవుడ్ నటి సనా తన కెరీర్ ఎదుగుదల గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది. అంతేకాదు తన కూతురు ఎదుర్కొన్న ఓ భయంకర సంఘటనను గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయింది. ‘మొదట నా సినీ కెరీర్ ప్రకటనలతో మొదలైంది. నాకు మా అత్తామామలు బాగా సపోర్ట్ చేశారు. హీరోయిన్గా అవకాశం వచ్చిన తర్వాత నాకు పెళ్లి అయిందని, పిల్లలున్నారని కూడా ఎవరికీ చెప్పొద్దన్నారు. అలాగే స్విమ్ సూట్, ఎక్స్పోజింగ్ చేయాలనడంతో చాలా అవకాశాలు తిరస్కరించాను. కుటుంబ కథలు ఎంచుకుంటూ ముందుకు సాగాను’ అని చెప్పింది.
అలాగే ‘నా కూతురికి చిన్న వయసులోనే హీరోయిన్ చాన్స్ వచ్చింది. కానీ, తనకు ఇంట్రెస్ట్ లేదని వద్దనుకుంది. పెళ్లి చేసిన తర్వాత తన అత్తింటివాళ్లు దుబాయ్ తీసుకెళ్లారు. అయితే అక్కడ దారుణంగా టార్చర్ పెట్టారు. తిండి పెట్టకుండా నరకం చూపించారు. బంగారం, డబ్బు వాడుకున్నారు. ఇదంతా జరుగుతున్నా.. నా కూతురు నాతో చెప్పలేదు. అనుమానం వచ్చి గట్టిగా అడిగితే అన్నీ విషయాలు బయటపెట్టింది. నా చేతులతో చాలా మందికి పెళ్లి చేశాను. నా కూతురి జీవితం ఇలా అయిపోయినందుకు కృంగిపోతున్నా. తనకు ఐదేళ్ల కొడుకు ఉన్నాడు. ఇటీవలే విడాకులు తీసుకుని ఓ యూట్యూబ్ ఛానెల్ నడిపిస్తోంది’ అంటూ తన మనోవేదనను పంచుకుంది.
Read more:
Sara Ali Khan: అది నా ఇష్టం.. మీకెందుకు?.. హిందూ-ముస్లిం గొడవపై సారా