- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చిరంజీవిపై పరువునష్టం దావాకు సిద్ధమైన ప్రముఖ నటుడు
X
దిశ, వెబ్‌డెస్క్: హీరోయిన్ త్రిషపై ప్రముఖ నటుడు మన్సూర్ అలీ ఖాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయనపై ఆ ఇండస్ట్రీ, ఈ ఇండస్ట్రీ అనే తేడా లేకుండా అందరూ మండిపడుతున్నారు. బహిరంగంగా త్రిషకు సపోర్ట్ చేస్తూ మన్సూర్‌ది వక్రబుద్ధి అని సీరియస్ అవుతున్నారు. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి కూడా త్రిషకు సపోర్ట్ చేస్తూ మన్సూర్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అయితే, తాజాగా.. చిరు వ్యాఖ్యలపై మన్సూర్ స్పందించారు. మెగాస్టార్ చిరంజీవిపై పరువు నష్టం, క్రిమినల్ కేసు వేయనున్నట్లు తెలిపారు. చిరంజీవితో పాటు త్రిష, ఖుష్బుపైనా దావా వేయనున్నట్లు పేర్కొన్నారు. వీరు తమ మాటలతో తనను హింసించారని చెప్పారు. కొందరు ఎడిట్ చేసిన వీడియోను వైరల్ చేశారని ఆయన ఆరోపించారు. తాను త్రిషపై అసభ్యకర వ్యాఖ్యలు చేయలేదని స్పష్టం చేశారు.
Advertisement
Next Story