అడ్వాన్స్ బుకింగ్స్ స్టార్ట్ చేసిన ‘ఫ్యామిలీ స్టార్’.. లింక్ మీకోసం!

by sudharani |   ( Updated:2024-04-06 17:44:40.0  )
అడ్వాన్స్ బుకింగ్స్ స్టార్ట్ చేసిన ‘ఫ్యామిలీ స్టార్’.. లింక్ మీకోసం!
X

దిశ, సినిమా: రౌడీ హీరో విజయ్ దేవరకొండ, బ్యూటీఫుల్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ జంటగా జటించిన తాజా సినిమా ‘ఫ్యామిలీ స్టార్’. డైరెక్టర్ పరుశురామ్ దర్శకత్వం వహించిన ఈ మూవీ రేపు రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజ్, శిరీష్ నిర్మించిన ఈ చిత్రం నుంచి ఇప్పటికే రిలీజైన ప్రతి అప్‌డేట్ ఫ్యామిలీ ఆడియన్స్‌ను, యూత్‌ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇక రిలీజ్ సమయం కూడా దగ్గరపడటంతో ఇప్పటికే మూవీ ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన చిత్ర యూనిట్.. ఇప్పుడు సెన్సార్ క్లియర్ అవ్వడంతో అడ్వాన్స్ బుకింగ్స్ కూడా స్టార్ట్ చేసింది.

ఈ మూవీకి సెన్సార్ యూ/ఏ సర్టిఫికేట్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఫ్యామిలీకి సంబంధించిన సినిమాలో కొన్ని బూతు డైలాగులు ఉన్నాయని అభ్యంతరం చెప్పిన సెన్సార్.. 4,5 డైలాగులను మ్యూట్ చేయించి క్లియరెన్స్ ఇచ్చేసింది. ఇక ‘ఫ్యామిలీ స్టార్’ మూవీ రన్‌టైం 150 నిమిషాలు ఉన్నట్లు మూవీ యూటిన్ అఫీషియల్‌గా ప్రకటిస్తూ.. అడ్వాన్స్ బుకింగ్స్ కోసం లింక్ కూడా ఇచ్చింది. ఈ మేరకు.. ‘ఈ వేసవిలో మీ ‘ఫ్యామిలీ స్టార్’ వేడుకలు చేసుకుందాం. TheFamilyStar 150 నిమిషాల సంపూర్ణ వినోదంతో వస్తోంది. రేపు ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానుంది. మీ టిక్కెట్లను ఇప్పుడే బుక్ చేసుకోండి!

Advertisement

Next Story