డబ్బు కోసం నా భార్య ఎవరితోనైనా పడుకుంటుంది.. రూ.1500 కోట్ల ఆస్తుందని ఆ నటుడితో ఎఫైర్ పెట్టుకుంది!

by Anjali |   ( Updated:2024-04-04 14:25:07.0  )
డబ్బు కోసం నా భార్య ఎవరితోనైనా పడుకుంటుంది.. రూ.1500 కోట్ల ఆస్తుందని ఆ నటుడితో ఎఫైర్ పెట్టుకుంది!
X

దిశ, వెబ్‌డెస్క్: సీనియర్ స్టార్ నటుడు నరేష్-పవిత్ర లోకేష్‌ ప్రస్తుతం రిలేషన్ లో ఉన్న విషయం తెలిసిందే. నరేష్‌కు ఇప్పటికే మూడు పెళ్లిళ్లు అయి భార్యలతో విడిపోయాడు. అత్త, వదిన, తల్లి పాత్రల్లో అద్భుతంగా నటించే పవిత్రకు కూడా ఆల్రెడీ వివాహం జరిగింది. భర్తతో డివోర్స్ కూడా తీసుకుంది. ప్రస్తుతం పవిత్ర-నరేష్ పీకల్లోతు ప్రేమలో ఉన్నారు. అయితే రీసెంట్ గా పవిత్ర లోకేష్ మాజీ భర్త సుచేంద్ర ప్రసాద్.. నరేష్-పవిత్ర పై సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు.

‘‘డబ్బు కోసం పవిత్ర ఎంతకైనా దిగజారుతుంది. ఎవరితోనైనా రిలేషన్ పెట్టుకుంటుంది. లగ్జరీ లైఫ్ కోసమే ఆమె నరేష్ తో ఎఫైర్ పెట్టుకుంది. ఆయన దగ్గర రూ.1500 ల కోట్ల ఆస్తి ఉందని పవిత్రకు ముందే తెలుసు. ఈ విషయం తెలుసుకున్నాకే నరేష్ తో రిలేషన్‌షిప్ స్టార్ట్ చేసింది. ఆయన ఏజ్ 60 ఏళ్లకు పైగా ఉంటుంది. పవిత్ర వయసు నరేష్ కంటే చాలా తక్కువ.. అయినా ఆయన్ను భర్తగా యాక్సెప్ట్ చేయడానికి ముఖ్యంగా డబ్బే కారణం’’ అంటూ పవిత్ర లోకేష్ మాజీ భర్త సుచేంద్ర ప్రసాద్ వెల్లడించారు. ప్రస్తుతం ఈయన కామెంట్స్ సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి.

ఇక నరేష్-సూపర్ స్టార్ మహేష్ బాబుకు రిలేషన్ ఉందన్న విషయం తెలిసిందే. ప్రముఖ నటి, దర్శకురాలైన నరేష్ తల్లి విజయ నిర్మలని సూపర్ స్టార్ కృష్ణ రెండో పెళ్లి చేసుకున్నారు. ఆ విధంగా మహేష్ బాబు- నరేష్ కజిన్ బ్రదర్స్ అవుతారు. వీరి బంధం ఈ మధ్యలోనే బయటపడటంతో జనాలంతా షాక్ అవుతున్నారు.

Advertisement

Next Story