ఆ కోరిక బయటపెట్టిన బ్యూటీ.. ఒంటరిగా ఉండలేకపోతున్నా.. భర్త కావాలంటూ కామెంట్స్!

by Jakkula Samataha |
ఆ కోరిక బయటపెట్టిన బ్యూటీ.. ఒంటరిగా ఉండలేకపోతున్నా.. భర్త కావాలంటూ కామెంట్స్!
X

దిశ, సినిమా : నటి ఎస్టర్ వాలెరీ నోరోన్హా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈమె తెలుగులో పలు సినిమాల్లో నటించి మంచి ఫేమ్ సంపాదించుకుంది. మరీ ముఖ్యంగా భీమవరం బుల్లోడులో నటించిన తర్వాత ఈ బ్యూటీ క్రేజ్ మరింత పెరిగింది. ఇక తర్వాత గరం, జయ జానికి నాయక, జాలియట్ లవర్ ఆఫ్ ఇడియట్, నయనం, ఐరావతం,69 సంస్కార్ కాలనీ, చాంగురే బంగారు రాజా, డేవిల్ బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ వంటి వాటిల్లో నటించి తన కంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. ఇక ఈ నటి 2019లో సింగర్ రాపర్ నోయెల్ సీన్‌ను వివాహం చేసుకొని, అధికారికంగా విడాకులు తీసుకొని విడిపోయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈ బ్యూటీకి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

ఈ బ్యూటీకి ప్రస్తుతం తెలుగులో అంతగా అవకాశాలు రావడం లేదు. దీంతో ఆమె ప్రస్తుతం ఎక్కువగా బోల్డ్ రోల్స్ నటిస్తున్నట్లు సమాచారం. కాగా ఈ నటి ఈ మధ్య టెనెంట్‌`లో ఇన్వెస్టిగేషన్‌ ఆఫీసర్‌గా తన నటన, యాక్షన్ సీన్స్‌లో అదరగొట్టింది. అయితే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ బ్యూటీ రెండో పెళ్లిపై ఆసక్తికర కామెంట్స్ చేసింది. రెండో పెళ్లి గురించి ఆమె మాట్లాడుతూ.. నాకు ఒంటరిగా బతకాలని లేదు. పెళ్లి చేసుకోవాని ఉంది. నాకు పార్టనర్‌ కావాలి, బ్యూటీఫుల్‌ లైఫ్‌ కావాలి. కానీ ఎవరిని చేసుకోవాలి అనేదానిపై పూర్తి క్లారిటీ లేదు. ఇప్పటికే మొదటి పెళ్లితో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. నన్ను అర్థం చేసుకునే వ్యక్తి కావాలి. షోకేస్ లాంటి మొగడు వద్దు అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ నటి చేసిన కామెంట్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

Advertisement

Next Story

Most Viewed