ఈ బోల్డ్ కంటెంట్ మూవీ రిలీజ్ అయితే.. నేను ఎక్కడైనా దాక్కోవాల్సిందే.. నిర్మాత కామెంట్స్

by Sujitha Rachapalli |
ఈ బోల్డ్ కంటెంట్ మూవీ రిలీజ్ అయితే.. నేను ఎక్కడైనా దాక్కోవాల్సిందే.. నిర్మాత కామెంట్స్
X

దిశ, సినిమా : బాలీవుడ్ కాంట్రవర్షియల్ ఫిమేల్ ప్రొడ్యూసర్ ఏక్తా కపూర్ బోల్డ్ ప్రాజెక్ట్స్ తెరకెక్కించడంలో ముందుంటుంది.ఆమె ఓటీటీ ప్లాట్‌ఫామ్ ALTBalaji మొత్తం అడల్ట్ కంటెంట్‌తో నిండిపోగా.. చివరగా ‘థాంక్యూ ఫర్ కమింగ్’ అంటూ ఫిమేల్ సెక్సువల్ ప్లెజర్ మూవీతో పలకరించింది. కానీ సినిమా రిలీజ్‌కు ముందు రెస్పాన్స్ పాజిటివ్‌‌గా ఉంటే.. విడుదలయ్యాక తమ సోషల్ మీడియా ఎకౌంట్స్ నెగెటివిటీతో నిండిపోయాయని చెప్పింది. కామెంట్స్‌లో బూతులు మాత్రమే ఉన్నాయని, దారుణంగా తిట్టారని తెలిపింది.

ఇక ఇప్పుడు అంతకన్నా బోల్డ్ కంటెంట్ ‘లవ్ సెక్స్ ఔర్ ధోకా 2’ రిలీజ్ అయ్యాక ఎక్కడికైనా వెళ్లి దాక్కోవాల్సిందేనని తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ఈ జనరేషన్‌లో ప్రేమ, పెళ్లి, మోసం చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుందని.. కచ్చితంగా ట్రోల్స్ నెక్స్ట్ లెవల్‌లో ఉంటాయని ఎక్స్‌పెక్ట్ చేస్తుంది. కాగా ‘లవ్ సెక్స్ ఔర్ ధోకా’ 2010లో రాగా సీక్వెల్‌గా రాబోతున్న ఈ ప్రాజెక్ట్‌కు దిబాకర్ బెనర్జీ దర్శకత్వం వహించారు.

Advertisement

Next Story

Most Viewed