దుల్కర్ సల్మాన్ 'King of Kotha' షూటింగ్ పూర్తి

by Shiva |   ( Updated:2023-05-31 10:24:47.0  )
దుల్కర్ సల్మాన్ King of Kotha షూటింగ్ పూర్తి
X

దిశ, వెబ్ డెస్క్ : దర్శకుడు అభిలాష్ జోషి, మాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో దుల్కర్ సల్మాన్ కాంబినేషన్ లో ఓ గ్యాంగ్‌స్టర్ నేపథ్యంతో మూవీ ప్రకటించిన సంగతి అందరికి తెలిసందే. ఈ సినిమాకి 'కింగ్ ఆఫ్ కోత' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేశారు. లేటెస్ట్ అప్‌డేట్ ప్రకారం, 150 రోజుల పాటు సాగే చివరి షెడ్యూల్‌తో కింగ్ ఆఫ్ కోత షూటింగ్ మొత్తం పూర్తయిందని సమచారం. ఈ షెడ్యూల్‌లో కొన్ని యాక్షన్ సన్నివేశాలను కూడా చిత్రీకరించినట్లు సమాచారం.

పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా త్వరలో ప్రారంభం కానున్నాయి. ఈ చిత్రంలో షబీర్ కల్లరక్కల్, గోకుల్ సురేష్, ఐశ్వర్య లక్ష్మి ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అభిలాష్ ఎన్.చంద్రన్ ఈ సినిమాకి కథను సమకూర్చారు. జీ స్టూడియోస్ మరియు వేఫేరర్ ఫిల్మ్స్ సంయుక్తంగా సినిమాను నిర్మిస్తున్నాయి. జేక్స్ బిజోయ్ మరియు షాన్ రెహమాన్ లు సంగీతం అందించగా, నిమిష్ రవి సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు.

Also Read: బాలయ్య నెక్ట్స్ సినిమా టైటిల్ ఇదేనా..!

పుష్ప-2 టీమ్ బస్సుకు రోడ్డు ప్రమాదం .. ఏడుగురికి తీవ్ర గాయాలు

Advertisement

Next Story