‘కింగ్‌ ఆఫ్‌ కోథా’.. ‘పుష్ప’ను కాపీ కొట్టిందనే కామెంట్స్‌పై స్పందించిన దుల్కర్ స‌ల్మాన్

by samatah |   ( Updated:2023-08-18 07:24:10.0  )
‘కింగ్‌ ఆఫ్‌ కోథా’.. ‘పుష్ప’ను కాపీ కొట్టిందనే కామెంట్స్‌పై స్పందించిన దుల్కర్ స‌ల్మాన్
X

దిశ, సినిమా: దుల్కర్ స‌ల్మాన్ నటిస్తున్న రీసెంట్ మూవీ ‘కింగ్ ఆఫ్ కోథా’. అభిలాష్ జోషి దర్శకత్వంలో గ్యాంగ్‌స్టర్ యాక్షన్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతోన్న ఈ సినిమా ఆగ‌స్ట్ 24న పాన్ ఇండియ‌న్ లెవెల్‌లో మ‌ల‌యాళంతో పాటు తెలుగు, త‌మిళం, క‌న్నడ‌, హిందీ భాష‌ల్లో రిలీజ్ కానుంది. అయితే తాజాగా ఈ మూవీకి సంబంధించిన ట్రైల‌ర్‌లో విడుదల కాగా ఇందులో దుల్కర్ స‌ల్మాన్ క్యారెక్టర్ మొత్తం ‘పుష్ప’లోని అల్లు అర్జున్‌ను కాపి కొట్టిన‌ట్లు క‌నిపించింద‌ని కొంద‌రు ట్రోల్ చేశారు. దీంతో ఈ నెగెటివ్ కామెంట్స్‌పై స్పందించిన దుల్కర్.. ‘మా ‘కింగ్ ఆఫ్ కోథా’ కాపీ సినిమా కాదు. ఏ సినిమాను, హీరోను ఇమిటేట్ చేయ‌లేదు. చెప్పాలంటే ‘పుష్ప’ కంటే ముందుగానే 2019లోనే ఈ సినిమా క‌థ‌ను ద‌ర్శకుడు అభిలాష్ జోషి సిద్ధం చేశాడు. అప్పటినుంచే ఈ క్యారెక్టర్‌పై వ‌ర్క్ చేస్తూ వ‌చ్చాం. కానీ ‘పుష్ప’ స్ఫూర్తితో ఈ సినిమాను తెర‌కెక్కించామ‌న్నది అబ‌ద్ధం. అల్లు అర్జున్ న‌ట‌న అంటే నాకు చాలా ఇష్టం. ఇక ‘పుష్ప’ లాంటి బ్లాక్‌బ‌స్టర్ హిట్‌తో నా సినిమాను కంపేర్ చేయ‌డం నేను కాంప్లిమెంట్‌గానే తీసుకుంటా. నెగెటివ్‌గా తీసుకోను’ అని దుల్కర్ చెప్పుకొచ్చాడు.

Read More: ‘ఖుషి’ రివ్యూ.. మూవీ కంటెంట్‌కు సెన్సార్ సభ్యులు ఫిదా?

Advertisement

Next Story