Double Smart: సెన్సార్ పూర్తి చేసుకున్న డబుల్ ఇస్మార్ట్.. ఏ సర్టిఫికెట్ వచ్చిందంటే?

by sudharani |
Double Smart: సెన్సార్ పూర్తి చేసుకున్న డబుల్ ఇస్మార్ట్.. ఏ సర్టిఫికెట్ వచ్చిందంటే?
X

దిశ, సినిమా: రామ్ పోతినేని, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ డెడ్లీ కాంబినేషన్‌లో వస్తున్న పాన్ ఇండియా మూవీ 'డబుల్ ఇస్మార్ట్'. ఇందులో కావ్య థాపర్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ పవర్ ఫుల్ క్యారెక్టర్‌లో కనిపించి మెప్పించనున్నాడు. ఇందులో నుంచి ఇప్పటి వరకు వచ్చిన ప్రతి అప్‌డేట్ ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకోగా.. సెన్సేషనల్ ప్రమోషనల్ కంటెంట్‌తో నేషనల్ వైడ్‌గా హ్యుజ్ బజ్ క్రియేట్ చేస్తున్నారు చిత్ర బృందం. పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై పూరి జగన్నాధ్, ఛార్మి కౌర్ గ్రాండ్‌గా నిర్మించిన ఈ సినిమా.. ఆగస్టు 15న తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇక రిలీజ్ సమయం కూడా దగ్గర పడటంతో ప్రమోషన్స్‌లో జోరు పెంచడంతో పాటు.. సెన్సార్ పనులు కూడా కంప్లీట్ చేసుకుంది చిత్ర బృందం.

ఈ మేరకు ఫుల్ యాక్షన్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కిన ‘డబుల్ ఇస్మార్ట్’ మూవీ ‘A’ సర్టిఫికెట్ సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ రిలీజ్ చేశారు చిత్ర బృందం. అలాగే సినిమా రన్ టైం విషయానికి వస్తే.. 2గంటల 42 నిమిషాలు ఉన్నట్లు సమాచారం. కాగా.. గతంలో సూపర్ హిట్ అందుకున్న ‘ఇస్మార్ట్ శంకర్’కు సీక్వెల్‌గా వస్తున్న ఈ చిత్రం ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి.

Advertisement

Next Story

Most Viewed