- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Dhee Dance Show: మన ఇంట్లో కూడా మదర్స్ ఉంటారు కదా.. హైపర్ ఆదిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన గణేష్ మాస్టర్
దిశ, సినిమా: జబర్దస్త్ షో ద్వారా చాలా మంది పాపులారిటీ సంపాదించుకున్నారు. అలా ఫేమస్ అయిన వారిలో హైపర్ ఆది కూడా ఒకరు. తన కామెడి టైమింగ్స్, పంచ్‌లతో నవ్వించి ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. జబర్దస్త్, ఢీ, శ్రీ దేవి డ్రామా కంపెనీ వంటి ప్రముఖ షోలో కామెడి చేస్తూ ఆడియన్స్‌కు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాడు. కానీ, కొన్ని సార్లు ఇతను వేసే జోక్స్ చాలా వల్గర్‌గా ఉంటాయని అదే ప్రేక్షకుల నుంచి తీవ్ర విమర్శలు కూడా వస్తుంటాయి. ఈ క్రమంలోనే తాజాగా హైపర్ ఆదిపై గణేష్ మాస్టర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈటీవీలో ప్రసారం అవుతున్న ఢీ షోకు ప్రస్తుతం శేఖర్ మాస్టర్, గణేష్ మాస్టర్, హీరోయిన్ హన్సిక జడ్జ్‌లుగా వ్యవహరిస్తున్నారు. దీనిలో భాగంగా తాజాగా టెలికాస్ట్ అయిన ప్రోమోలో చిరంజీవి అల్లుడా మజాకా మూవీలోని అత్తో అత్తమ్మ కూతురో అనే సాంగ్‌కు డాన్సర్లు పెర్ఫామెన్స్ చేశారు. అయితే ఈ సాంగ్‌లోని తల్లి వయస్సున్న ఆమెతో అసభ్యకరంగా డ్యాన్స్ వేయించడంపై గణేష్ మాస్టర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై ఆయన మాట్లాడుతూ.. యాపిల్ పెట్టుకుని డ్యాన్స్ చేయండి.. కానీ మార్చుకోవడం ఎందుకు? మన ఇంట్లో కూడా మదర్స్ ఉన్నారు కదా. వాళ్ళు చూస్తే ఎంత అసభ్యంగా ఉంటుంది. ఇది డ్యాన్స్ షో.. జోక్ కాదు. ఇంకోసారి ఇలాంటి పెర్ఫామెన్స్ ఇస్తే అసలు మార్కులే ఇవ్వను” అంటూ సదరు డ్యాన్స్ మాస్టర్‌కు వార్నింగ్ ఇచ్చారు.
అయితే దీనిపై హైపర్ ఆది ఫన్నీగా గణేష్ మాస్టర్‌ని ఇమిటేట్ చేశాడు. దీంతో హైపర్ ఆదిపై గణేష్ మాస్టర్ చాలా సీరియస్ అయ్యారు. నేను చెప్పింది రైటా రాంగా అని హైపర్ ఆదిని గణేష్ మాస్టర్ ప్రశ్నించారు. యాపిల్ సీక్వెన్స్ మాత్రం తప్పని హైపర్ ఆది ఒప్పుకున్నారు. మరి అలాంటప్పుడు దీనిపై ఎలా కామెడీ చేస్తారని హైపర్ ఆదిపై గణేష్ మాస్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
(video link credits to mallemala tv youtube channel)