- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సహనం చచ్చేదాక చూడొద్దు.. ఇదేనా జర్నలిజం..? రేణుదేశాయ్ ఫైర్
దిశ, వెబ్‌డెస్క్: తెలుగు ప్రజలకు రేణుదేశాయ్ పేరును ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈమె సినిమా హీరోయిన్‌గా కంటే పవన్ కళ్యాణ్ మాజీ భార్యగానే చాలా ఫేమస్. సోషల్ మీడియాలో నిత్యం యాక్టీవ్‌గా ఉండే రేణు తరుచూ తనపై వచ్చే కామెంట్లపై స్పందిస్తూనే ఉంటుంది. ఏపీ రాజకీయాల్లో తరచూ ఆమె పేరు నానుతూనే ఉంటుంది. పవన్ కళ్యాణ్‌పై రాజకీయ విమర్శలు చేయాలంటే రేణుదేశాయ్ పేరును ప్రస్తావించాల్సిందే అన్నట్లుగా వారి కామెంట్స్ ఉంటాయి. తాజాగా రేణుదేశాయ్ జర్నలిస్టులపై ఫైర్ అయింది. పవన్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత తన పర్సనల్ లైఫ్‌ను, వ్యత్తిగత విషయాలను బజారున పడేస్తున్నారని మండిపడింది.
‘‘రాజకీయాల్లోకి సినిమా వాళ్ల వ్యక్తిగత జీవితాన్ని ఎందుకు లాగుతున్నారు? వాటి వల్ల సమాజానికి ఏమన్నా నష్టం వాటిల్లుతుందా? అసలు జర్నలిజం అంటే ఏంటి? ఇలా అవతల వాళ్ల వ్యక్తిగత జీవితాలపై మాట్లాడుకుంటూ కూర్చొని షో చేయడమా? సినిమా వాళ్ల పర్సనల్ లైఫ్ వల్ల సమాజానికి శాంతి భద్రతలకు ఏమన్నా నష్టం వచ్చిందా? అలాంటప్పుడు ఎందుకు ప్రతిసారి మా వ్యక్తిగత జీవితాన్ని లాగుతున్నారు? సినిమా ఇండస్ట్రీ వాళ్లు సాఫ్ట్‌గా ఉంటారని ఇలా ఏది పడితే అది మాట్లాడితే ఎవరికైనా సహనం చచ్చిపోతుంది’’ అంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కామెంట్స్‌ను ఆమె తన ఇన్ స్టాలో స్టేటస్‌గా పెట్టుకుంది. ప్రస్తుతం రేణుదేశాయ్ పోస్ట్ వైరల్‌గా మారింది.