'ఇంకోసారి స్టేడియంలో కనిపించావనుకో'..! వర్షిణిపై నెటిజన్స్ ఫైర్

by sudharani |   ( Updated:2023-05-07 14:38:54.0  )
ఇంకోసారి స్టేడియంలో కనిపించావనుకో..! వర్షిణిపై నెటిజన్స్ ఫైర్
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం ఐపీఎల్ మ్యాచ్‌లు జరుతున్న విషయం తెలిసిందే. హైదరాబాద్ మైదానంలో జరిగిన అన్ని మ్యాచులకు టీవీ యాంకర్ వర్షిణి పోయింది. దానికి సంబంధించిన పోస్ట్‌లు సోషల్ మీడియాలో అభిమానులతో షేర్ చేసుకుంది. అయితే ఆమె వెళ్లిన ప్రతి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ ఓడిపోయింది. దీంతో ఆమె మ్యాచ్‌లకు వెళ్లడం వల్లే సన్‌రైజర్స్ టీం ఓటమీ పాలయ్యిందని.. అభిమానులు వర్షణిపై ఓ రేంజ్‌లో మండిపడుతున్నారు. సెంటిమెంట్స్ ఫాలో అయ్యే ఎస్ఆర్‌హెచ్ ఫ్యాన్స్.. ‘‘ఇంకోసారి స్టేడియంలో కనిపించకు’’ అంటూ వర్షిణికి వార్నింగ్‌లు ఇస్తున్నారు. కొందరు అయితే.. ‘‘సన్ రైజర్స్‌కు ఉన్న దరిద్రం చాలు, నువ్వు కూడా తోడైతే ఆ జట్టు గట్టెక్కినట్లే’’ అని ‘‘అక్కా.. దయ చేసి నువ్వు స్టేడియంకు రాకు’’ అంటూ మరికొందరు వేడుకుంటున్నారు.

Also Read..

రూమర్స్‌‌కు చెక్.. మూవీ స్టార్ట్ చేసిన సాయి పల్లవి

Advertisement

Next Story