బాత్రూమ్‌లోనే అన్ని ఫీలింగ్స్ బయటపెడతా.. బ్రష్, షాంపూ డబ్బాలే నా బాధ అర్థం చేసుకుంటాయి

by samatah |   ( Updated:2023-08-16 09:26:35.0  )
బాత్రూమ్‌లోనే అన్ని ఫీలింగ్స్ బయటపెడతా.. బ్రష్, షాంపూ డబ్బాలే నా బాధ అర్థం చేసుకుంటాయి
X

దిశ, సినిమా : రియా కపూర్ అప్ కమింగ్ మూవీ ‘థ్యాంక్యూ ఫర్ కమింగ్’లో నటించే అవకాశం దక్కడంపై హ్యాపీగా ఫీల్ అవుతోంది నటి డాలీ సింగ్. ‘నా కెరీర్‌లో ఇది మరొక పెద్ద చిత్రం. ప్రేక్షకుల ముందుకు రావాడానికి చాలా ఎగ్జైట్‌గా ఉన్నాను. ఎందుకంటే మొదటిసారిగా నేను ఊహించని సరికొత్త పాత్ర పోషించాను. నా బాత్రూమ్‌లో టూత్ బ్రష్‌లు, షాంపూ బాటిళ్లతోపాటు అద్దంలో నా స్వంత ప్రతిబింబంతో మాట్లాడతాను. నన్ను నేను కొత్తగా చూసుకుంటాను. పిల్లలు చేసే వెర్రి పనులన్నీ ఇందులో చేశాను’ అని చెప్పింది. అలాగే నటిగా ఎల్లప్పుడూ తాను మారాలని కోరుకుంటానన్న డాలీ.. ఎల్లప్పుడూ పెద్ద స్క్రీన్‌పై తనను చూసుకోవాలని నిరంతరం కలలు కంటానని, కానీ పరిశ్రమకు ఇంతకాలం దూరంగా ఉన్నందున దాని గురించి ఆలోచించి ప్రయోజనం లేదని అర్థం చేసుకున్నట్లు చెప్పింది. చివరగా జీవితంలో అన్ని అనుకున్నట్లు జరగవని, పలు వెబ్ సిరీస్‌ల్లోనూ నటిస్తున్నట్లు తెలిపింది. ఇక ఈ మూవీ అక్టోబర్ 6న థియేటర్లలో విడుదలకానుంది.

Read More: భర్త బర్త్ డే స్పెషల్.. సెమీ న్యూడ్ లుక్‌లో హీటెక్కించిన కరీన

Advertisement

Next Story