- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కాజల్ అగర్వాల్ భర్తకు ఫేవరెట్ హీరోయిన్ ఎవరో తెలుసా.. ఇంట్లో పూరి నచ్చదు కానీ బయట చపాతి నచ్చుతుంది అంటూ
దిశ, సినిమా: స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు ఇండస్ట్రీలోకి ‘లక్ష్మీ కళ్యాణం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి తనకంటూ సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్‌ను క్రియేట్ చేసుకున్నది. ఇక స్టార్ హీరోలందరితో నటించి టాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకుల మనసులు గెలుచుకుంది. తెలుగులోనే కాకుండా తమిళ, హిందీ లో నటించింది ఈ భామ. ఇక కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే గౌతమ్ కిచ్లును ప్రేమించి పెళ్లి చేసుకుంది. కరోనా సమయంలో కొన్నాళ్ళు సినిమాలకు గ్యాప్ ఇచ్చి బాబుని కని ఫ్యామిలీ లైఫ్ గడుపుతుంది. ఇప్పుడు మళ్ళీ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తుంది. మొదటిసారిగా లేడీ ఓరియెంటెడ్ మూవీ సత్యభామ లో నటించింది. అయితే ఈ సినిమా జూన్ 7న థియేటర్లలో విడుదల కాగా మిక్స్‌డ్ టాక్ తెచ్చు్కుంది. ఇలా వరుస సినిమాలతో దూసుకుపోతున్న ఈ భామ తన భర్త గౌతమ్ కిచ్లూ గురించి చేసిన కామెంట్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కాజల్ తన భర్త గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. కాజల్‌ను తన భర్త తన వివాహానికి ముందు నువ్వు చేస్తున్న పనికి(హీరోయిన్‌గా) అభిమాని కాదా అని యాంకర్ అడగగా దానికి కాజల్ ఫన్నీ టోన్‌లో తన భర్త గౌతమ్ నాకు కాదు అభిమాని హార్డ్‌కోర్ సమంతా అభిమాని అని చెప్పింది. ప్రస్తుతం ఈమె చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. అదే విధంగా ఇంట్లో ఉండే పూరి నచ్చదు మనకు బయట దొరికే చపాతినే నచ్చుతుంది అని ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు.