బన్నీఆ 100 రూపాయల నోటును ఇప్పటికి ఎందుకు దాచుకుంటారో తెలుసా?

by Anjali |
బన్నీఆ 100 రూపాయల నోటును ఇప్పటికి ఎందుకు దాచుకుంటారో తెలుసా?
X

దిశ, సినిమా: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప -2 చిత్ర షూటింగ్‌లో ఫుల్ బిజీగా గడిపేస్తున్నారు. పుష్ప పార్ట్ వన్‌తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకొన్న బన్నీ ఒక్కో సినిమాకు ఎన్ని కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. అలాంటిది ఈ హీరో 23 ఏళ్ల నాటి ఒక్క రూ. 100 నోటును మాత్రం ఇప్పటికి భద్రంగా దాచిపెట్టుకుంటారట. ఎందుకంటే.. ‘‘గతంలో మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా చాలా మంది ప్రముఖులను ఆహ్వానించారట.

ఈ వేడుకలో చిన్నపిల్లలంతా కలిసి డాన్స్ చేస్తున్నారట. అయితే ఈ బర్త్ డే పార్టీకి హాజరైన స్టార్ దర్శకుడు రాఘవేంద్రరావు పిల్లలందరి డాన్స్‌ చేస్తుండగా.. ఈయన చూపు కేవలం బన్నీ మీదనే పడిందట. అక్కడున్న పిల్లలందరిట్లో ఐకాన్ స్టార్ మాత్రమే డిఫరేంట్‌గా డాన్స్ చేస్తున్నారట. దీంతో దర్శకుడు బన్నీ ఎప్పటికైనా స్టార్ హీరో గుర్తింపు తెచ్చుకుంటారని గ్రహించి, బన్నీని దగ్గరికి తీసుకుని ప్రశంసించారట.

అలాగే అల్లు అర్జున్ మదర్ నిర్మల‌ను దగ్గరికి పిలిపించుకుని.. ‘‘నీ కుమారుడ్ని నేనే సినీ ఇండస్ట్రీకి పరిచయం చేస్తానని చెప్పి.. ఆమెకు అడ్వాన్స్‌గా 100 రూపాయల నోటు ఇచ్చారట. ఇక అప్పటి నుంచి బన్నీ ఆ వంద రూపాయల నోటును ఎంతో అపురూపంగా దాచిపెట్టుకుంటాడని రీసెంట్‌గా నిర్మల ఈ విషయాన్ని బయటపెట్టింది. మరీ ఆ సినిమా ఏంటో తెలుసా? అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ‘గంగోత్రి’ చిత్రం. ఈ సినిమాకు ప్రముఖ దర్శకుడు దర్శకత్వం వహించి.. మొదటి సినిమాతోనే బన్నీకి స్టార్ గుర్తింపు తీసుకొచ్చారు.

Advertisement

Next Story