శాకుంతలం సినిమాకు మొదట అనుకున్న ఆ స్టార్ హీరో ఎవరో తెలుసా?

by Sathputhe Rajesh |   ( Updated:2023-03-23 03:47:33.0  )
శాకుంతలం సినిమాకు మొదట అనుకున్న ఆ స్టార్ హీరో ఎవరో తెలుసా?
X

దిశ, వెబ్‌డెస్క్: డైరెక్టర్ గుణశేఖర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాజెక్టు శాకుంతలం. ఇందులో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత.. మలయాళీ నటుడు దేవ్ మోహన్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలాన్ని వెండితెరపై డైరెక్టర్ గుణశేఖర్ తనదైన శైలిలో తెరకెక్కించారు. ఈ సినిమాను గుణ టీమ్ వర్క్స్ నిర్మిస్తోంది. దిల్ రాజు డిస్ట్రిబ్యూటర్ గా వ్యవహరిస్తున్నారు.

ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, సాంగ్స్ ఆకట్టుకోగా.. ఇటీవల విడుదలైన ట్రైలర్ సినిమాపై ఆసక్తిని పెంచింది. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్స్ లో చిత్ర యూనిట్ బిజీగా ఉంది. ఓ వైపు వరుస సినిమాలతో బిజీగా ఉన్నా సమంత మాత్రం సినిమా ప్రమోషన్స్ పై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ క్రమంలో డైరెక్టర్ గుణశేఖర్ ఈ సినిమాకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. దేవ్ మోహన్ దుష్యంతుడి పాత్రలో మొదట దుల్కర్ సల్మాన్ ను తీసుకోవాలని డైరెక్టర్ భావించారట.

కానీ దుల్కర్ సల్మాన్ అప్పటికే సీతారామం సినిమా కోసం సైన్ చేయడంతో సినిమాకు నో చెప్పారని డైరెక్టర్ తెలిపారు. అయితే ఈ సినిమాలో తెలుగు హీరోలను తీసుకోకపోవడానికి కూడా రీజన్ ఉందట. హీరోయిన్ ప్రాధాన్యత ఉన్న చిత్రాల్లో నటించేందుకు టాలీవుడ్ హీరోలు ముందుకు రాలేదని అందుకే హీరో దేవ్ మోహన్ ను తీసుకున్నట్లు డైరెక్టర్ గుణశేఖర్ తెలిపారు.

Also Read: అలా చేసి సమంతపై పగ తీర్చుకున్న నాగార్జున ?

Advertisement

Next Story