Skanda movie లో రామ్ చెల్లెలిగా నటించిన అమ్మాయి ఎవరో తెలుసా..?

by Prasanna |   ( Updated:2023-10-01 05:25:26.0  )
Skanda movie లో రామ్ చెల్లెలిగా  నటించిన అమ్మాయి ఎవరో తెలుసా..?
X

దిశ,వెబ్ డెస్క్: హీరో రామ్ పోతినేని, శ్రీ లీల జంటగా నటించిన మొదటి పాన్ ఇండియా మూవీ స్కంద. ఈ సినిమా మొదటి రోజు మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకుని కలెక్షన్స్ లో దూసుకెళ్తుంది. రామ్ ద్విపాత్రాభినయంలో నటించారు. ఫ్లాప్ లతో సతమవుతున్న రామ్ కి ఈ సినిమా నుంచి ఊరట లభించింది. ఏదైనా కొత్త సినిమా విడుదల అయ్యిందంటే చాలు.. ఆ మూవీలో నటీనటుల గురించి నెట్లో తెగ వెతికేస్తుంటారు. ఇప్పుడు తాజాగా స్కంద సినిమాలో నటించిన ఒక అమ్మాయి కోసం నెటిజెన్స్ ఆరాలు తీయడం మొదలు పెట్టారు.

స్కంద సినిమాలో సెకండాఫ్ లో రామ్ పోతినేని సిస్టర్ గా కాసేపు సందడి చేసింది. ఈమె సోషల్ మీడియా లో మంచి పాపులారిటీ సంపాదించుకుంది. భీమవరానికి చెందిన ఈమె పేరు అమృత చౌదరి, ఇంజనీరింగ్ పూర్తి చేసి సినిమాలలో నటించాలని ఆశగా ఎదురుచూస్తున్న సమయంలో ఈ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. ఎలాంటి దుస్తులలోనైనా సరే చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది. ఈ సినిమా కంటే ముందుగా కొన్ని షార్ట్ ఫిలిమ్స్ లో నటించింది. ఈ అమ్మాయికి సంబంధించిన ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.

Advertisement

Next Story