Bahubali సినిమాలో కట్టప్ప పాత్రను మిస్ చేసుకున్న హీరో ఎవరో తెలుసా?

by samatah |   ( Updated:2023-02-06 10:36:35.0  )
Bahubali సినిమాలో కట్టప్ప పాత్రను మిస్ చేసుకున్న హీరో ఎవరో తెలుసా?
X

దిశ, వెబ్‌డెస్క్ : బాహుబళి మూవీకి ఎంత క్రేజ్ ఉందో, ఆ మూవీలో కట్టప్ప పాత్రకు కూడా అంతే క్రేజ్ ఉంది. దర్శక ధీరుడు జక్కన్న దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సౌత్ సినిమాలకు ఏ మాత్రం తీసిపోకుండా మంచి కలెక్షన్స్‌తో పాటు పేరు ప్రఖ్యాతలు సాధించి, ఎన్నో అవార్డ్స్ ను కైవసం చేసుకుంది.

ఇక ఆ సినిమాలో ప్రతి పాత్రకు ఆయా నటులు ప్రాణం పోశారనే చెప్పాలి. ముఖ్యంగా ఫస్ట్ పార్ట్ చాలా మందిని అలరించడమే కాకుండా, ఎప్పుడూ ఆలోచించేలా చేసింది. ఆలోచించడమేంటి అనుకుంటున్నారా? ఈ మూవీ ఫస్ట్ పార్ట్ ఎండింగ్‌లో కట్టప్ప చేతిలో బాహుబలి చనిపోతాడు. బహుబలిని అంత ఇష్టంగా ప్రేమగా చూసుకునే కట్టప్ప బహుబలిని ఎందుకు చంపాడు అని చాలా మంది సెకండ్ పార్ట్ వచ్చే వరకు ఆలోచించారు. దీంతో కట్టప్ప పాత్రకు, ఆపాత్ర పోషించిన సత్యరాజ్‌కు క్రేజ్ చాలా పెరిగిపోయింది.

అయితే ఈ పాత్ర ముందుగా సత్యరాజ్‌ను అనుకోలేదంట. మలయాళ నటుడు మోహన్ లాల్‌కి కట్టప్ప పాత్ర చేసే అవకాశం వచ్చిందంట, కానీ మోహన్ లాల్ ఆ పాత్ర నచ్చక దాన్ని రిజక్ట్ చేశాడంట. కానీ సినిమా తర్వాత మోహన్ లాల్ ఆ పాత్ర చేస్తే బాగుండేదని బాధపడినట్లు సమాచారం.

Advertisement

Next Story