- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Amitabh Bachchan: మురారి మూవీ చూసి కృష్ణవంశీకి ఫోన్ చేసి అమితాబ్ బచ్చన్ ఏం అడిగాడో తెలుసా?
దిశ, సినిమా : ఈ మధ్య టాలీవుడ్లో రీరిలీజ్ ట్రెండ్ బాగా నడుస్తుంది. మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా ఆగస్టు 9న మురారీ సినిమాని రీ రిలీజ్ చేసిన విషయం మనకీ తెలిసిందే. ఈ రీరిలీజ్ సినిమాలను థియేటర్లో వేసినప్పుడు ఫ్యాన్స్ విజిల్స్, గోల తప్ప సినిమాని చూడటం తక్కువే. అయితే, కలెక్షన్స్ ఫుల్ గా కలెక్ట్ చేసి కొత్త రికార్డ్ సృష్టించింది. మహేష్ అభిమానులు అయితే బాగా ఎంజాయ్ చేశారు. ఈ మూవీకి సంబంధించిన నటీనటులు యూ ట్యూబ్ ఛానెల్ కి ఇంటర్వ్యూలు ఇవ్వడంతో ఆసక్తికర విషయాలు ఎన్నో బయటకొచ్చాయి.
అయితే, అప్పట్లో ఈ సినిమా చూసి కృష్ణవంశీకి ఫోన్ చేసి అమితాబ్ బచ్చన్ ఇలా అడిగాడట. మురారి మూవీ అమితాబ్ బచ్చన్ కి బాగా నచ్చడంతో ఆ మూవీని బాలీవుడ్లో రీమేక్ చేయమని అడిగారట. అది కూడా తన కొడుకు అభిషేక్ బచ్చన్ తో చేయాలంటూ రిక్వెస్ట్ కూడా చేసాడని వార్తలు వచ్చాయి. కానీ, సమయం లేక తీయలేకపోయారని అంటున్నారు.
ఇప్పటి వరకు ఎన్నో సినిమా రీమేక్ లు అయ్యాయి. కానీ, ఈ సినిమాకే సమయం లేకపోవడం ఏంటో.. మురారి బాలీవుడ్ లో రాకపోయినా కన్నడలో గోపి అనే టైటిల్ తో రీమేక్ అయింది. అక్కడ కూడా హిట్ కొట్టి మంచి కలెక్షన్స్ సాధించింది.
- Tags
- Amitabh Bachchan