కొత్త జంట కీర్తి సురేశ్‌, ఆంటోనీల మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?.. అస్సలు ఊహించి ఉండరుగా

by Kavitha |
కొత్త జంట కీర్తి సురేశ్‌, ఆంటోనీల మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?.. అస్సలు ఊహించి ఉండరుగా
X

దిశ, సినిమా: స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘నేను శైలజ’ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత ‘నేను లోకల్’, ‘మహానటి’, ‘అజ్ఞాత వాసి’, ‘దసరా’, ‘మిస్ ఇండియా’ వంటి సినిమాల్లో నటించి మెప్పించింది. ఇక ‘మహానటి’, ‘దసరా’ చిత్రాలకు అయితే అవార్డులు కూడా వచ్చాయి. అలాగే నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ తన అంద చందాలతో అదరహో అనిపిస్తుంది. ప్రస్తుతం రెండు మూడు ప్రాజెక్టులతో బిజీ బిజీగా ఉంది. ఇక తాజాగా కీర్తి సురేష్ తన చిన్ననాటి స్నేహితుడైన ఆంటోని తటిల్‌తో వివాహ బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఈ వేడుక కేవలం అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో గోవాలో జరిగింది. ఈ క్రమంలో కీర్తి- ఆంటోనిలకు సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

నిన్న కీర్తి సురేష్ తన పెళ్లి ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆ పిక్స్ కాస్త నెట్టింట వైరల్‌గా మారాయి. ఇక వాటిని చూసిన నెటిజన్లు, ఆమె అభిమానులు, సెలబ్రిటీలు ఈ నూతన జంటకు శుభాకాంక్షలు తెలియజేశారు. అయితే ఈ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వీరి మధ్య ఏజ్ గ్యాప్ గురించి కొందరు చర్చించుకుంటున్నారు. అయితే ప్రస్తుతం కీర్తి సురేష్ వయసు 32 సంవత్సరాలు, కాగా ఆమె భర్త ఆంటోని వయసు 35 సంవత్సరాలు. అంటే కీర్తి కంటే తన భర్త కేవలం 3 ఇయర్స్ మాత్రమే పెద్ద. ఇక ఈ జంట గత 15 ఏళ్లుగా ప్రేమించుకుంటున్న సంగతి తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed