Naga Chaitanya and Shobitha నాగచైతన్య, శోభితల మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

by Jakkula Samataha |
Naga Chaitanya and Shobitha నాగచైతన్య, శోభితల మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
X

దిశ, సినిమా : నాగచైతన్య, శోభిత ప్రేమలో ఉన్నట్లు అనేక వార్తలు వచ్చాయి. చివరకు అవే నిజం అయ్యాయి. నేడు అక్కినేని నాగచైతన్య ఎంగేజ్మెంట్‌ను నాగార్జున తన ఇంట్లో చాలా సింపుల్‌గా జరిపించేశాడు. ఈ వేడుకకు పలువురు సెలబ్రిటీలు కూడా హాజరు అయ్యారు.ఇక అక్కినేని నాగార్జునే స్వయంగా, చైతూ,శోభిత ఎంగేజ్మెంట్ ఫోటోలు షేర్ చేస్తూ వారికి శుభాకాంక్షలు తెలపడంతో, పలువురు అభిమానులు కూడా వారికి అభినందనలు తెలియజేస్తున్నారు.

ఇక చైతూ, శోభిత నిశ్చితార్థం జరగడంతో వీరికి సంబంధించిన అనేక వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. వీరి ప్రేమ ఎలా పుట్టింది, వీరిద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంత అంటూ అనేక వార్తలు వస్తున్నాయి. కాగా, దాని గురించే ఇప్పుడు మనం తెలుసుకుందాం.

అయితే అక్కినేని నాగచైత్య,శోభిత చాలా కాలంగానే ప్రేమించుకుంటున్నారంట. కానీ కావాలనే ఈ విషయాన్ని వారు రహస్యంగా ఉంచారంట. కానీ వీరి లవ్ గురించి మొదట నుంచి మీడియా కోడై కూస్తున్న విషయం తెలిసిందే. ఒక రోజు చైతూ ప్లాట్ ముందు శోభిత కారు ఉండటం, వీరి ఫారెన్ టూర్స్‌కు వెళ్తూ ఎంజాయ్ చేయడంతో వీరు డేటింగ్‌లో ఉన్నారంటూ ఎన్నో రూమర్స్ వచ్చాయి. కానీ ఈ రూమర్స్ వస్తున్నా చై, శోభితా పట్టించుకోకుండా తమ పని తాము చేసుకుంటూ వెళ్లిపోయారు. సడెన్‌గా ఎంగేజ్‌మెంట్ చేసుకొని అందరికీ షాకిచ్చారు. అయితే వీరిద్దరి మధ్య చాలా ఏజ్ గ్యాప్ ఉందంట. దాదాపు ఆరు ఏళ్లు ఏజ్ గ్యాప్ ఉన్నట్లు తెలుస్తోంది. నాగచైతన్య 1986 లో జన్మించగా,శోభిత 1992లో ఏపీలో జన్మించింది. ఇక ఈమె పలు సినిమాల్లో నటించి మంచి ఫేమ్ సంపాదించుకుంది.

Advertisement

Next Story