Klin Kaara కోసం నైట్ డ్యూటీలు చేస్తున్న Ram Charan పెద్ద కూతురు? ఎవరో తెలుసా?

by Prasanna |   ( Updated:2023-07-18 06:30:00.0  )
Klin Kaara కోసం నైట్ డ్యూటీలు చేస్తున్న Ram Charan పెద్ద కూతురు? ఎవరో తెలుసా?
X

దిశ, వెబ్ డెస్క్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన ఇటీవల ఆడబిడ్డకు జన్మనిచ్చిన విషయం మనకు తెలిసిందే. పెళ్లైన 11 ఏళ్ల తర్వాత వీరిద్దరూ తల్లిదండ్రులుగా ప్రమోట్ అవ్వడంతో అటు మెగా ఫ్యామిలీ, ఇటు మెగా అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

అయితే తాజాగా క్లిన్ కారాకు సంబంధించి ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ఫొటోలో క్లిన్ కారా కోసం రామ్ చరణ్‌ పెద్ద కూతురు నైట్ డ్యూటీలు చేస్తుంది. ఇంతకీ ఆ పెద్ద కూతురు ఎవరా అని ఆలోచిస్తున్నారా? ఎవరో కాదండి.. రామ్ చరణ్, ఉపాసన దంపతుల పెంపుడు శునకం రైమ్‌. గత కొన్నేళ్ల నుంచి రైమ్ ను ఎంతో ప్రేమగా పెంచుకుంటున్నారు . వీరి దాన్ని వదిలి ఒక రోజు కూడా ఉండలేరు.రామ్ చరణ్ రైమ్ ను, వారి పెద్ద కూతురులా భావిస్తారు. రైమ్ పేరిట ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ కూడా ఓపెన్ చేసారు. అందులో 67 వేలకు పైగా మంది ఫాలోవర్స్ కూడా ఉన్నారు. ఈ ఇన్‌స్టా అకౌంట్ లో ఓ ఫోటోను పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో రైమ్‌ ఉయ్యాలలో ఉన్న క్లిన్ కారాను తొంగి చూస్తూ కనిపించింది. ఇక ఈ ఫొటోకు `నైట్ డ్యూటీ చేస్తూ తన చెల్లిని జాగ్రత్తగా చూసుకుంటున్నాను` అని ఇంట్రెస్టింగ్ గా క్యాప్షన్ కూడా పెట్టారు. ఈ ఫోటో చూసిన మెగా అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

Also Read: నిహారిక విషయంలో భయపడిపోతున్న నాగబాబు అసలేమైదంటే?

Rashmika వదులుకున్న భారీ సినిమాలు ఇవే? అన్నీ అట్టర్ ప్లాఫ్..

Advertisement

Next Story